స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన `పుష్ప` ది రైజ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ సెక్షన్ ఆడియన్స్ పెదవి విరిచేసినా మాస్ ఆడియన్స్ లో మాత్రం పుష్ప రాజ్ వేగాన్ని ఆపడం మాత్రం సాధ్యపడలేదు. సినిమాలో మాసిజం ఓ వర్గం అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రష్మిక మందన్నాతో ఐకాన్ స్టార్ రొమాంటిక్ సన్నివేశాలు ఓ రేంజ్ లో పండాయి. అందులో వ్యాన్ సన్నివేశం కుర్రాళ్లలో కాకలు పుట్టిస్తోందని టాక్. వ్యాన్ లోపల కుర్చుని ఉన్న పుష్పరాజ్...శ్రీవల్లితో ప్రయివేట్ రొమాన్స్ బీసీ ఆడియన్స్ లో మంటలు పుట్టిస్తోంది. సీన్ లో బోల్డ్ అప్పియరెన్స్ చాలామందికి బాగా కనెక్ట్ అయింది.
అలాంటి మాస్ రొమాంటిక్ సీన్స్ ఆడియన్స్ కి కిక్కిచ్చాయన్న టాక్ ఉంది. ఓసారి ఆ సీన్ లోకి వెళ్తే.. పుష్పరాజ్..శ్రీవల్లి వ్యాన్ లో కూర్చుని ఉండగా పుష్పరాజ్ ఒక చేతిని శ్రీవల్లి భుజంపై వేసి చిలిపి పనులు చేస్తుంటాడు. ఆ సీన్ లో శ్రీవల్లి ముఖంలో ఎక్స్ ప్రెషన్స్.. ఎమోషన్ ని బట్టి ఆపై ఏం జరిగిందో ఊహకే వదిలేయాలి. ఇంత హాట్ సీన్ లో రష్మిక ఎమోషన్ ని చక్కగా క్యారీ చేసింది. ఈ సీన్ కి మాస్ థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఓ సెక్షన్ ఆడియన్స్ ఆ ఒక్క సీన్ కోసం రెండవసారి టిక్కెట్ కొని మరి సినిమాకెళ్తున్నారనేది టాక్. అయితే ఈ సన్నివేశం ఫ్యామిలీ తో కలిసి కూర్చుని చూడటం మాత్రం ఇబ్బంకరమని ఒక సెక్షన్ చెబుతోంది.
దీంతో ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి మేకర్స్ తొలగించారు. ఫ్యామిలీ ఆడియన్స్ అసౌకర్యాన్ని గుర్తించి దర్శకుడు సుకుమార్...బన్నీ తో చర్చించి ఆ సన్నివేశాన్ని ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సుకుమార్ స్క్రిప్ట్ లో కొంచెం బోల్డ్ యాంగిల్ ఉంటుంది. సన్నివేశం పండటం కోసం పూర్తి వాస్తవికంగా చూపించడానికి ఇష్టపడతారు. సుకుమార్ గత సినిమాల్ని పరిశీలిస్తే చాలా సినిమాల్లో ఇలాంటి మసాలా సన్నివేశాలెన్నో. కానీ ఈసారి `పుష్ప` నిడివి ఎక్కువగా ఉండటం.. ఇతరుల ఇబ్బందిని గుర్తించి ఆ సీన్ తొలగించడంతో 5 నిమిషాలు సినిమా ట్రిమ్ అయింది. పుష్ప తొలి వీకెండ్ కలెక్షన్స్ కి డోఖా లేదు. ఈ ఆదివారంతో పూర్తి వరల్డ్ వైడ్ వసూళ్లు ఏ రేంజులో వర్కవుటయ్యాయో రిపోర్ట్ రావాల్సి ఉంది. అమెరికాలో ఇప్పటికే వన్ మిలియన్ క్లబ్ లో చేరిన ఈ చిత్రం 2 మిలియన్ క్లబ్ లో చేరడం కష్టమేమీ కాదన్న టాక్ వినిపిస్తోంది. రంగస్థలం- అల వైకుంఠపురం లాంటి చిత్రాలు అమెరికాలో 3మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాయి. ఆ స్థాయిని పుష్ప అందుకుంటుందా లేదా చూడాలి.