కథల్లో సృజనాత్మకత.. పాత్రల ఆవిష్కరణలో స్వేచ్ఛ లేకుంటే ఇక సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడం ఎందుకు? క్రియేటివ్ ఫ్రీడమ్ లేకపోతే వీక్షకులకు ప్రతిదీ చప్పగానే ఉంటుంది. అలా ఉంటే ఎవరైనా టైమ్ వేస్ట్ చేసుకుని సినిమాలు టీవీలు సిరీస్ లకు కళ్లప్పగిస్తారంటారా?
సరిగ్గా ఇదే పాయింట్ ని రైజ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ లాయర్లు `హస్ముఖ్` వెబ్ సిరీస్ ప్రసారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా వాదనలు వినిపించి హైకోర్టులో నెగ్గడం చర్చకొచ్చింది. విర్ దాస్- నిఖిల్ అద్వాణీ జోడీ తెరకెక్కించిన ఈ సిరీస్ పై తాజాగా దిల్లీ హైకోర్టులో విచారణ సాగింది. లాయర్ల ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా మనోభావాల్ని దెబ్బ కొట్టే విధంగా ఇందులో పాత్రల్ని డిజైన్ చేశారని ప్రసారాన్ని అడ్డుకోవాలని ప్రతివాది కోర్టులో కేసు వేశారు. దీంతో నెట్ ఫ్లిక్స్ ఆ సిరీస్ ని ఎయిర్ చేసేందుకు నానా తంటాలు పడుతోంది. మంగళవారం నాడు తీర్పులో నెట్ ఫ్లిక్స్ లో `వీర్ దాస్ హస్ముఖ్` సిరీస్ ని ప్రసారం చేయడానికి మధ్యంతర స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సదరు కల్పిత ధారావాహిక న్యాయవాదుల ప్రతిష్టకు హాని కలిగిస్తుందన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసి పుచ్చింది. అంతేకాదు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. న్యాయవాది అశుతోష్ దుబే ఇచ్చిన దరఖాస్తును జస్టిస్ సంజీవ్ సచ్ దేవా తోసిపుచ్చారు.
ఆ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారంపై శాశ్వత నిషేధం కోరుతూ వేసిన ప్రధాన పిటిషన్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. దీనిపై జూలైలో విచారణ జరపనుంది కోర్ట్. రాజ్యాంగం ప్రకారం .. వాక్ స్వాతంత్య్రానికి.. భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రత్యర్థి పిటిషనర్ వాదించారని నెట్ ఫ్లిక్స్ తరపు లాయర్ వాదన వినిపించారు. న్యాయవాదులను ఒక వర్గంగా టార్గెట్ చేసి పరువు తీయడం సాధ్యపడదని చెప్పే అనేక తీర్పులు ఉన్నాయని వారు వాదించారు. వారి వాదనను హైకోర్టు సమర్థించింది. అయితే విర్ దస్ హస్ముఖ్ సిరీస్ లో లాయర్ల వృత్తిపై అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయన్న వాదన ప్రస్తుతం నెటిజనుల్లోనూ వినిపిస్తోంది.