స్వదేశంతో పాటు విదేశాల్లోనూ `బాహుబలి` పేరుతో తెలుగు వాడి ఖ్యాతి విస్తరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపనీలు ఈ సినిమాని వోన్ చేసుకున్న తీరు అమోఘం. బాహుబలి స్టార్లు ప్రభాస్ - రానాలకు వీరాభిమానులున్నారు అక్కడ. 2017 డిసెంబర్ లో జపనీ వెర్షన్ ని రిలీజ్ చేసింది ఆర్కామీడియా బృందం. అప్పుడు ప్రమోషన్స్ కోసం కథానాయకుడు ప్రభాస్ సహా శోభు యార్లగడ్డ జపాన్ విజిట్ చేశారు. అక్కడ అభిమానుల్ని కలుసుకున్నారు. మన బాహుబలి జపనీ పురాణ కథల్ని పోలి ఉందని అక్కడ జపాన్ పత్రికలు - మ్యాగజైన్లు హైలైట్ చేయడం - కార్టూన్ల రూపంలో పొగిడేయడం ప్రముఖంగా చర్చకొచ్చింది. బాహుబలిని టాప్ రేటింగ్ తో కొనియాడారు క్రిటిక్స్.
ప్రస్తుతం మరోసారి బాహుబలి టీమ్ జపాన్ వెళుతోంది. అక్కడ కామిక్ కాన్ ఉత్సవాల్లో రానా దగ్గుబాటి - శోభు యార్లగడ్డ పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరూ బయల్దేరారట. రానా - శోభు టీమ్ తో ఏదో ఒక క్షణం ప్రభాస్ కూడా జపాన్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జపనీల ఆదరణ గొప్పది. ఆ దేశంలో బాహుబలి సిరీస్ అసాధారణ విజయం సాధించింది. అందుకే మరోసారి టీమ్ విజిట్ చేసిందట.
తాజాగా రానా కొన్ని కార్టూన్లను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇవి జపాన్ దేశంలో పత్రికలు ప్రచురించిన కార్టూన్స్. అందులో భళ్లాల దేవ గెటప్ - మాహిష్మతి సామ్రాజ్యం ఉన్నాయి. ఒక కార్టూన్ కి జై మాహిష్మతి అంటూ కొటేషన్ ఇచ్చాడు రానా. ప్రపంచ దేశాల్లో ప్రభాస్ - రానా తమకంటూ అభిమానుల్ని క్రియేట్ చేసుకుని యూనివర్శల్ హీరోలుగా మార్కెట్ పెంచుకుంటున్న తీరు అనన్య సామాన్యం అనే కీర్తించాలి. ఈ ప్రయత్నాన్ని కొనియాడాల్సిందే. ఇక రానా నటించే తదుపరి సినిమాలన్నీ జపాన్ - చైనా లాంటి చోట రిలీజ్ అవుతాయనడంలో సందేహం లేదు. ప్రభాస్ `సాహో`ని జపాన్ - చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.