మంచి గౌరవాన్ని అందుకున్న దర్శకుడు

Update: 2017-12-04 05:43 GMT
మంచి చిత్రాలు వస్తే జనాలు ఎప్పుడైనా ఆదరిస్తారు అని రాజా ది గ్రేట్ సినిమా నిరూపించిందని చెప్పాలి. కమర్షియల్ హంగులను జోడించి సినిమా మొత్తంగా మంచి కథాంశాన్ని చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఒక విజయాన్ని అందుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అంతే కాకుండా అప్పటివరకు అపజయాలతో సతమతమైన మాస్ మహా రాజా రవితేజ కెరీర్ కి కూడా అనిల్ బూస్ట్ ఇచ్చాడనే చెప్పాలి.

ఒక హీరో కళ్లులేని వాడిగా కనిపించి అందరిని ఎంతో నవ్వించి ఒక మంచే మెస్సేజ్ ని ఇవ్వగానే ఇచ్చాడు. అయితే అలాంటీ మంచి సినిమాను తెరకెక్కించిన అనిల్ ని తెలంగాణా ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖ - సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ సత్కరించింది. అతనిపై పలువురు అధీకారులు ఎన్నో ప్రశంసలను అందించారు. మంచి చిత్రం వస్తే తెలంగాణ ప్రభుత్వం వారిని తప్పకుండా గుర్తిస్తుందని అధికారులు మాట్లాడారు.

అనిల్ రావిపూడి కూడా ఈ గౌరవాన్ని అందుకుంటున్నందుకు చాలా అందంగా ఉందని తెలియజేశాడు. ప్రస్తుతం అనిల్ F2 అనే మరో మంచి ఎంటర్టైన్మెంట్ కథను రెడీ చేసుకుంటున్నాడు. మల్టి స్టారర్ గా తెరకెక్కబోయే ఆ సినిమాకు ఇప్పటికే వెంకటేష్ ఫిక్స్ అయ్యారు. ఇక రానా మరో హీరోగా సెలెక్ట్  అయినట్లు సమాచారం. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  
Tags:    

Similar News