ఈ మధ్య విపరీతంగా ఖరీదు పెట్టి ఆస్తులు కొనేయడం ఎక్కువగానే నడుస్తోంది. బాగా పోష్ ఏరియాలో కోట్లు ఖర్చుపెట్టి ఫ్లాట్స్ కొనేయడం.. అంతకు అంత ఖర్చు చేసి ఇంటీరియర్స్ చేయించడం లాంటివి బాగానే చేస్తున్నారు సెలబ్రిటీలు.
40ప్లస్ లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఐశ్వర్యారాయ్ మళ్లీ సత్తా చేస్తున్న సంగతి తెలిసిందే. తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఇప్పుడీ మాజీ మిస్ వరల్డ్.. ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిందట. ముంబై లోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న ఈ ఫ్లాట్ విస్తీర్ణం ఎంతో తెలుసా.. ఏకంగా 5500 చదరపు అడుగులు. ఈ ఫ్లాట్ కోసం ఈ జంట ఏకంగా 21 కోట్లను ఖర్చు పెట్టేశారని తెలుస్తోంది. ఇంత ఖరీదు చేసే అపార్ట్ మెంట్స్ అంటే ఆటోమేటిగ్గా చుట్టుపక్కల ఉండేవారంతా ఆ రేంజ్ వాళ్లే అని ఊహించేసుకోవచ్చు. ఇంతకీ ఐశ్వర్యారాయ్ పొరుగున ఉండేవాళ్లు ఎవరో తెలుసా.. మరో బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా ఈ కాంప్లెక్స్ లోనే ఉంటుందట.
2015లో ఈ ఫ్లాట్ ను బుక్ చేసుకున్న ఐష్-అభి కపుల్.. త్వరలోనే ఈ ఫ్లాట్ కి మారబోతున్నారు. ఇది కాకుండా.. వర్లిలో ఓ స్విష్ ఫ్లాట్ కూడా బచ్చన్ ఫ్యామిలీ సొంతం. అలాగే దుబాయ్ లో కూడా ఈ జంటకు ఓ ఖరీదైన ఫ్లాట్ ఉందని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఫనే ఖాన్ మూవీలో అనిల్ కపూర్ - రాజ్ కపూర్ రావ్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది ఐశ్వర్యా రాయ్.