కార్తి - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'దేవ్'. ఈ సినిమాకు రజత్ రవి శంకర్ దర్శకుడు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. 2 నిముషాల 10 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ లో సినిమా ఎలా ఉంటుందో చూచాయగా హింట్ ఇచ్చాడు దర్శకుడు.
"ఏ పని చేసేటప్పుడు డబ్బు పేరు కన్నా నీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సిన పని" అంటూ కార్తి చెప్పడంతో స్టార్ట్ అవుతుంది ట్రైలర్. హీరోకు అడ్వెంచర్ అంటే ఇష్టం. ఎక్కడైతే సాహసాలు ఉంటాయో అక్కడ రిస్కులు కూడా ఉంటాయి కదా. తన అడ్వెంచర్ల కోసం ఎంత దూరం వెళ్ళాడన్నదే హీరో క్యారెక్టరైజేషన్. ఇక హీరోయిన్ ను ఒక ఆడది మగతోడు లేకుండా బతక గలదా అని అడిగితే "మగతోడే కాదు.. ఇనిషియల్ లేకపోయినా కూడా బ్రతగ్గలదు" అనే ఫెమినిస్ట్ టైపు! అంతే కాదు "నేను సెల్ఫిషే.. నేను జీవితంలో సెల్ఫిష్ గా ఉండటానికి సెల్ఫిష్ గా ఉండడంలో ఏ తప్పూ లేదు" అని గట్టిగా నొక్కి ఒక్కాణించే రకం. మరి ఆ సాహసికి.. ఈ సెల్ఫిష్ రూపసికి లింక్ ఎలా కుదిరింది.. ఆయన అడ్వెంచర్లు ఇద్దరి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయన్నదే కథలా ఉందనిపిస్తోంది.
హీరో.. హీరోయిన్ల సిద్ధాంతాలు.. ప్రేమ సమీకరణాలే కాకుండా కామెడీ.. థ్రిల్ అనిపించే యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉన్నాయి. రమ్య కృష్ణ.. ప్రకాష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఎమోషన్స్ కూడా ఉన్నట్టే. హ్యారిస్ జయరాజ్ చాలా రోజుల తర్వాత సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విజువల్స్ లో కూడా ఒక రిచ్ లుక్ ఉంది. ఓవరాల్ గా సినిమాను చూడాలని అనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్ళలో ఉన్న ట్రైలర్. సంతోషంగా ఉండడమే మనం చేయాల్సిన పని అని దేవ్ ఆల్రెడీ శెలవిచ్చాడుగా.. ఆలస్యం ఎందుకు.. ఓ లుక్కేయండి.
Full View