తేజూ చేసేది మరో ప్రస్థానమా?

Update: 2020-03-13 11:30 GMT
ప్రస్థానం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు దేవా కట్టా అప్పటి నుండి కమర్షియల్‌ హిట్‌ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. బ్రేక్‌ ఇచ్చే హీరో కోసం ఎదురు చూస్తున్న దేవా కట్టాకు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఛాన్స్‌ ఇచ్చాడు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా లాంచనంగా ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం తేజ్‌ చేస్తున్న సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రం పూర్తి అయిన తర్వాత దేవా కట్టా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తేజ్‌ తో తీయబోతున్న సినిమా కథను వెస్ట్‌ గోదావరి జిల్లాలో జరిగిన ఒక పొలిటికల్‌ గొడవను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని తయారు చేశాడట. గతంలో ప్రస్థానం సినిమాను పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కించిన దేవాకట్టా మరోసారి అదే తరహా లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జతకలిపి తీసేందుకు స్క్రిప్ట్‌ సిద్దం చేసినట్లుగా సమాచారం అందుతోంది.

ప్రతి రోజు పండుగే వంటి కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం సోలో బ్రతుకే సోబెటర్‌ తో మరో కమర్షియల్‌ హిట్‌ పై కన్నేశాడు. ఈ సమయంలోనే ప్రస్థానం వంటి పొలిటికల్‌ డ్రామాను చేసేందుకు తేజ్‌ నిర్ణయం తీసుకోవడం సాహసమే అంటున్నారు. కమర్షియల్‌ హిట్‌ తో రైజింగ్‌ లో ఉన్న సమయంలో ఇలాంటి కాన్సెప్ట్‌ చిత్రాలను ఎందుకు చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్‌ కాస్త అసహనంతో కామెంట్స్‌ చేస్తున్నారు. వరుసగా ఆరు ఫ్లాప్‌ ల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు అనుకుంటుంటే మళ్లీ ప్రయోగాల జోలికి వెళ్లడం ఏంటీ అంటూ మరికొందరు తేజ్‌ పై రుసరుసలాడుతున్నారు. మరి తేజ్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్‌ కు ఎలాంటి టర్న్‌ ను తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News