వెన్నెల, ప్రస్థానం సినిమాలు దేవా కట్టాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఆటోనగర్ సూర్య’ ఫ్లాపైనా అతడి ప్రతిభను ఎవ్వరూ తక్కువ చేయలేరు. తాను చేసిన మూడు సినిమాల్లోనూ వైవిధ్యం చూపించిన ఈ దర్శకుడు.. మరో కొత్త కథాంశంతో ముందుకొస్తాడనుకుంటే.. అతనేమో రీమేక్ ఎంచుకున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘అరిమా నంబి’ని ‘డైనమైట్’గా రీమేక్ చేశాడు. ఐతే వాస్తవానికి తనకు రీమేక్ సినిమా చేసే ఉద్దేశం లేదని.. ‘అరిమా నంబి’ని కూడా ఆసక్తి లేకుండానే చూశానని.. కానీ సినిమా చూశాక తనకు బాగా నచ్చి రీమేకు కు ఒప్పుకున్నానని దేవా చెప్పాడు. ‘‘విష్ణుకు అరిమా నంబి నచ్చింది. నన్ను చూడమన్నాడు. నాకు ఆసక్తి లేకుండానే సినిమా చూశాను. ఐతే చూశాక బాగా నచ్చింది. అందులోని క్యారెక్టర్లతో అప్పటికప్పుడు కనెక్టైపోయాను. రీమేక్ కు దర్శకత్వం వహించడానికి అంగీకరించాను’’ అని చెప్పాడు.
రీమేక్ అయినప్పటికీ ఉన్నదున్నట్లు దించేయలేదని.. తెలుగు ఆడియన్స్ టేస్టుకు తగ్గట్లు మార్పులు చేశామని దేవా చెప్పాడు. తమిళంతో పోలిస్తే యాక్షన్ సీక్వెన్స్ చాలా ఒరిజినల్ గా అనిపిస్తాయని.. ఇందుకోసం విష్ణు పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదని అన్నాడు. విష్ణు పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల కేవలం 56 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశామని.. ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమైందని.. ఐతే ‘బాహుబలి’ సినిమా వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు తమ సినిమా సరైన టైమింగ్ తో ప్రేక్షకుల ముందుకొస్తోందని దేవా చెప్పాడు. జేడీ చక్రవర్తి పోషించిన విలన్ పాత్ర సినిమాకు హైలైట్ అవుతుందన్న దేవా.. ఆ పాత్ర ప్రవేశం తర్వాత సినిమా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పాడు. ప్రేక్షకుల్ని ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టే థ్రిల్లర్ ఇదని దేవా చెప్పాడు.