ఉత్తరాది- దక్షిణాది సంగమం ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లో హాట్ టాపిక్. సౌత్ సినిమా సత్తా ఎంతో హిందీ సినీపరిశ్రమకు అర్థమవుతోంది. బ్లాక్ బస్టర్ ఫార్ములాని సౌత్ లో వెతుక్కుంటూ వస్తున్నారు అక్కడి వాళ్లు. బాలీవుడ్ తో పోలిస్తే దక్షిణాది పరిశ్రమల్లో నవ్యపంథా కథల వెల్లువ అసాధారణ స్థాయికి చేరుకుందని తాజా సన్నివేశం చెబుతోంది. అందుకే మన దర్శకరచయితలకు పెద్ద రేంజులోనే హిందీ పరిశ్రమలో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే బోలెడన్ని సౌత్ సినిమాలు హిందీ పరిశ్రమలో రీమేకై బ్లాక్ బస్టర్లు సాధించాయి. తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేకై సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో హిందీ ఫిలిం మేకర్స్ చూపు పూర్తిగా ఇటువైపే మళ్లుతోంది.
ఇప్పుడు దేవాకట్టా `ప్రస్థానం` వంతు. ట్యాలెంటెడ్ దేవా కట్టా తెరకెక్కించిన తెలుగు కల్ట్ క్లాసిక్ మూవీ `ప్రస్థానం` హిందీ పరిశ్రమకు వెళుతోంది. అక్కడ సంజయ్ దత్-అలీ ఫజల్- అమైరా దస్తూర్- మనీషా కొయిలారా లాంటి టాప్ కాస్టింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్ వగైరా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. హిందీ ఆడియెన్ సెన్సిబిలిటీస్ ని టచ్ చేస్తూ పెర్ఫెక్ట్ రీమేక్ ని దేవాకట్టా రూపొందించారని విజువల్స్ చెబుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ప్రస్థానం హిందీ చిత్రసీమలో రీమేకవుతోంది. నేటి ఆడియెన్ అభిరుచికి తగ్గట్టే మలచడం ద్వారా దేవాకట్టా ఈ చిత్రంతో హిట్టు కొడతాడా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రస్తుతం హిందీ ప్రస్థానం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈనెల 20న సినిమా ఉత్తరాదిన అత్యంత భారీగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ .. ప్రస్థానం రీమేక్ ని దేవాకట్టా అత్యద్భుతంగా తెరకెక్కించారని యథాతథంగా కాపీ చేయకుండా హిందీ ప్రేక్షకులకు తగ్గట్టు మలిచారని ప్రశంసలు కురిపించారు. భాష- యాస-వేషం ప్రతిదీ అక్కడ ఆడియెన్ కి తగ్గట్టే ఈ చిత్రానికి అడాప్ట్ చేశారని ప్రీవిజువల్స్ తేల్చి చెప్పాయి. దేవాకట్టా మాట్లాడుతూ-``సంజయ్ దత్- జాకీ ష్రాఫ్- మనీషా కొయిరాలా వంటి స్టార్లతో పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ల దగ్గర ఏ కంటెంట్ ఉంచినా దానిని ది బెస్ట్ గా చేసి చూపిస్తారు. ఇంతకంటే అత్యుత్తమమైన నటీనటులు దొరుకుతారని నేను అనుకోను. నా సినిమా ప్రజలకు బాగా నచ్చుతుందనే భావిస్తున్నాను`` అని తెలిపారు.