జె.డి.చక్రవర్తి ఉరఫ్ గెడ్డం చక్రవర్తి.. పిలుపు ఏదైనా బుద్ధిగా పలుకుతాడు. జేడీ అని ముద్దుగా పిలిచినా అభ్యంతరం చెప్పడు. అసలు జేడీ అనే మాష్టర్ పీస్ ని కనిపెట్టింది రామ్ గోపాల్ వర్మ. వర్మ లేనిదే జేడీ లేడు. జేడీ లేనిదే వర్మ కూడా లేడు. అంతగా ఈ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం ఉంది. ఒక్క సత్యతో జేడీని రామూ ఇంటర్నేషనల్ ఫిగర్ ని చేసేశాడు. ఫలితం ఇట్నుంచి అటు వెళ్లిపోయిన జేడీ బాలీవుడ్ లో చాలా సినిమాల్లోనే నటించాడు.
కానీ ఎంతయినా తెలుగు వాడు కాబట్టి ఆ మమకారం చావక ఇక్కడా వదిలిపెట్టకుండా నటించాడు. డైరెక్టర్ గానూ ఓ చెయ్యేశాడు. కానీ ఎక్కడా పీక్స్ కి మాత్రం ఎదగలేకపోయాడు. జేడీ హవా ఓ దశాబ్ధం పాటు సాగింది. హీరోగా, క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా బాగానే రాణించాడు. కానీ కాలక్రమంలో అతడు తెలుగులో కనుమరుగయ్యాడు. ఇటీవలి కాలంలో అసలే సినిమాల్లేవ్. కోలీవుడ్ లోనూ లక్ చెక్ చేసుకునే ఉద్ధేశంతో అతడు అటు వైపు కూడా వెళ్లొచ్చాడు కానీ ఫలితం శూన్యం.
అయినా ఇప్పుడు జేడీకి దేవాకట్టా రూపంలో ఓ చక్కని అవకాశం. జేడీ దేవా దర్శకత్వం వహించిన డైనమైట్ లో విలన్ గా నటించాడు. అతడి క్యారెక్టర్ ఓ షాకింగ్ అని చెబుతున్నాడు దేవాకట్ట. ఈ సినిమాతో జేడీ సర్ ప్రైజ్ ఇవ్వడం ఖాయం. అతడిని తెరపైనే చూడండి అని పిలుపునిచ్చాడు. డైనమైట్ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్. కుర్చీ అంచుమీద కూచోబెడుతుందని దేవాకట్టా అన్నాడు.