దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ లవ్ స్టోరీ `సీతారామం`. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ యునానిమస్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. టాలీవుడ్ వరుస ఫ్లాపులతో క్రైసిస్ లో వున్న టైమ్ లో భారీ విజయాన్ని సాధించింది.
ఈ మూవీతో పాటు `బింబిసార` కూడా అనూహ్యంగా విజయం సాధించడంతో టాలీవుడ్ లో కొత్త జోష్ మొదలైంది. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రారా అని ఇండస్ట్రీ వర్గాలు భయపడుతున్న వేళ ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచి కొత్త ఉత్సాహాన్ని అందించాయి.
ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎపిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన `సీతారామం` పై ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు పొలిటికల్ లీడర్స్, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా దేవసేన అనుష్క కూడా స్పందించారు. ఓ విధంగా సినిమాపై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలతో పాటు సినిమాకు పని చేసిన ప్రతీ క్రాఫ్ట్ పై ప్రశంసలు కురిపించింది. `సీతారామం` మిమ్మల్ని చాలా సున్నితంగా ఆలింగనం చేసుకుని సీతారాముడి ప్రయాణంలో మిమ్మల్ని సహానుభూతి పొందేలా చేస్తుంది. ఇదొక అందమైన చిత్రం. అభినందనలు సీతా, రామ్, అఫ్రీన్... అంటూ ప్రశంసలు కురిపించింది.
అంతే కాకుండా ఈ మూవీకి పని చేసిన ప్రతీ వ్యక్తి, ప్రతీ ఒక్క క్రాఫ్ట్ హృదయాన్నిపెట్టి పని చేశారు. మరెన్నో హృదయాలల్ని కదిలించింది. మరెన్నో హృదయాలని కదిలించే కథలకు చీర్స్.. అంటూ స్పందించింది. 1965 నేపథ్యంలో సాగే `సీతారామం` యుద్ధంతో రాసిన ప్రేమకథగా తెరకెక్కి ఎన్నో హృదయాల్ని కదిలిస్తూ విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలైన ఈ మూవీ మూడు భాషల్లోనూ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.