‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ కి దేవిశ్రీ ప్రసాద్ వస్తాడా రాడా అన్న విషయంలో సస్పెన్సుకి తెరపడినట్లే. అతను ఆడియో వేడుకకు రావడం దాదాపుగా ఖాయమే. దేవిశ్రీ తండ్రి సత్యమూర్తి చనిపోయి ఇంకా రెండు వారాలు కూడా కాలేదు. మధ్యలో జరిగిన ‘నేను శైలజ’ ఆడియో ఫంక్షన్ కి కూడా అతను రాలేదు. ఈ నేపథ్యంలో ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో దేవి కనిపించడం డౌటే అనుకున్నారంతా. ఐతే ఈ రోజు దేవిశ్రీ చేసిన ట్వీట్లను బట్టి అతను ఈ ఫంక్షన్ కి వచ్చే అవకాశాలున్నట్లే కనిపిస్తోంది.
‘నాన్నకు ప్రేమతో’ ఆడియోను తన తండ్రి సత్యమూర్తికి అంకితమిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్న దేవి.. ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. ‘ఐ వానా ఫాలో ఫాలో’ పాట రికార్డింగ్ సందర్భంగా ఎన్టీఆర్ ప్రేమగా దేవిని వాటేసుకున్న ఫొటో అది. ఈ ట్వీట్లు అవీ చూస్తుంటే దేవి తండ్రి పోయిన బాధ నుంచి కాస్త కోలుకున్నట్లే కనిపిస్తోంది. దేవిశ్రీ మునుపటిలా వేదిక ఎక్కి పెర్ఫామ్ చేయకున్నా.. కనీసం వేడుకకు వచ్చి కూర్చున్నా బాగానే ఉంటుంది. సుకుమార్ కూడా దేవిని ఆ విధంగానే చెప్పి వేడుకకు రప్పిస్తున్నాడట. ఆదివారం రాత్రి శిల్పకళా వేదికలో ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.