తన కెరీర్ లో ఇప్పటిదాకా ఒక్క ట్యూన్ కూడా కాపీ కొట్టలేదని అంటున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్య తెలుగులో కాపీ ట్యూన్స్ ఎక్కువైపోతున్నాయన్న విమర్శలపై దేవి స్పందిస్తూ.. ‘‘నేనైతే నా కెరీర్ లో ఇప్పటివరకూ కాపీ కొట్టలేదు. ఒక సినిమా విషయంలో దర్శకుడు ఒక వెస్ట్రన్ ట్యూన్ వినిపించి, కాపీ కొట్టమంటే నో అనేశా. మనం సంగీతం నేర్చుకొని కాపీ కొడుతున్నామంటే అసలు చేస్తున్న పనికి అర్థమే లేదు. ఎక్కడైనా ఒక స్వరం కలిస్తే చెప్పలేం కానీ.. తెలిసి మాత్రం నేనెప్పుడూ వేరే ట్యూన్ తీసుకోలేదు. ఒకరి ట్యూన్ కాపీ కొట్టడమంటే అది పెద్ద నేరం కిందే లెక్క’’ అన్నాడు దేవి.
తన దృష్టిలో చిన్న పెద్ద సినిమాలు అస్సలు చూపించనని.. నిజానికి కొన్ని చిన్న సినిమాలకు తానిచ్చిన పాటలు పెద్ద సినిమాల్లో కంటే బాగా పాపులర్ అయ్యాయని దేవి చెప్పాడు. చిన్నదైనా - పెద్దదైనా సినిమా నచ్చితేనే చేస్తా కాబట్టి ఔట్ పుట్ విషయంలో అస్సలు రాజీ పడే ప్రసక్తే ఉండదని.. పని విషయంలో తేడా చూపించనని దేవి అన్నాడు. కుమారి 21 ఎఫ్ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోందన్న దేవి... త్వరలో తన నుంచి రాబోయే నాన్నకు ప్రేమతో - సర్దార్ గబ్బ్ సింగ్ ఆల్బమ్స్ కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటాయన్నాడు. ‘‘నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆడియో చాలా బాగా వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ పాటల విషయంలో పవన్ చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఒక మెలోడీ విని పెద్ద మెసేజ్ పెట్టారు’’ అన్నాడు దేవి.