బ్రేక్ ఇచ్చేందుకు దేవి రెడీ

Update: 2018-07-03 04:17 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లీగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఈ ఏడాది రంగస్థలం మూవీకి ఇచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యూజిక్ తో పాటల ప్రియులందరిని సూపర్ గా మెప్పించాడు. దీని తరవాత భరత్ అనే నేను సినిమాతో ఇంకో హిట్ కూడా దేవి శ్రీ ఖాతాలో పడింది. ప్ర్రస్తుతం ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ టాలెంటెడ్ మ్యుజిషియన్స్ ను ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ గా మంచి సింగర్లను ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నాడు. ఈమధ్య ఓ రోజు కూలి పాడిన పాట నెట్ లో వైరల్ గా మారింది. ఇది మ్యూజిక్ డైరెక్టర్లను కూడా బాగా ఇంప్రెస్ చేసింది. అతనెవరా అని చాలామంది ఆరా తీశారు. ఓ అభిమాని అతడి పేరు ఉన్ని నూరప్పడు అని చెబుతూ.. ఫోన్ నంబర్ దేవికి షేర్ చేశాడు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ థ్యాంక్స్ చెబుతూ ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ గురించి తనకు తెలియజేయాలంటూ పోస్టు పెట్టాడు.

‘‘టాలెంట్ ఉండి గుర్తింపు లేకుండా మిగిలిపోయిన మ్యుజీషియన్స్ ను వెలుగులోకి తెచ్చే నేను గతంలోనే మొదలుపెట్టాను. ఆ పని ఇప్పటికీ ఇంకా కొనసాగుతోంది. నా అన్వేషణకు ఈ సమాచారం ఎంతో ఉపయోగడపడుతుంది. ఎక్కడైనా ఇలాంటి టాలెంట్ ఉందని గుర్తిస్తే దయచేసి నాకు పోస్ట్ చేయండి’’ అంటూ ఫోన్ నెంబర్ పెట్టిన అభిమానికి రిప్లయ్ ఇచ్చాడు. మొత్తానికి కొత్త టాలెంట్ ను దేవిశ్రీ ప్రసాద్ బాగానే ప్రోత్సహిస్తున్నాడు.
Tags:    

Similar News