దేవీశ్రీ హీరోగా.. క‌ల నెర‌వేరే వేళ నిర్మాత ఎవ‌రో..!

Update: 2021-07-01 04:32 GMT
టాలీవుడ్ మ్యూజిక్ సంచ‌ల‌నం దేవీశ్రీ ప్ర‌సాద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. అప్ప‌ట్లో రాక్ స్టార్ దేవీశ్రీ హీరోగా సినిమా లాంచ్ అయినా కానీ మధ్య‌లో ఏమైందో కానీ దానిని విర‌మించారు.

ప్ర‌స్తుతం అత‌డు వ‌రుస‌గా టాప్ హీరోల‌తో ప‌ని చేస్తూ సంగీత ద‌ర్శ‌కుడిగా పూర్తి బిజీగా ఉన్నారు. కానీ ఇంత‌లోనే అత‌డు హీరో అవుతున్నాడంటూ మ‌రోమారు గుస‌గుస వేడెక్కిస్తోంది.

దేవీశ్రీ హీరో అయితే ఆ సినిమా నిర్మించేది ఎవ‌రు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. దేవీశ్రీ స్నేహితురాలు పూరి క‌నెక్ట్స్ సీఈవో ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌న్న గుస‌గుస మ‌రింత వేడెక్కిస్తోంది. ఛార్మి ప్ర‌స్తుతం పూరి-క‌ర‌ణ్ ల‌తో క‌లిసి లైగ‌ర్ చిత్రానికి ఒక నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఆ క్ర‌మంలోనే దేవీశ్రీ‌తో సినిమా చేయాల‌ని భావిస్తున్నారా? అంటే దానికి అధికారికంగా స‌మాచారం రావాల్సి ఉంది.

ఇంత‌కుముందు ఛార్మి.. దేవీశ్రీ స్నేహం పై ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేసిన నేప‌థ్యంలో అత‌డి సినిమాకి ఛార్మి నిర్మాత అన‌గానే ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమా హార‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. దేవీశ్రీ ప్ర‌స్తుతం పుష్ప డ్యుయాల‌జీకి సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు స్టార్ హీరోల చిత్రాల‌కు ఆయ‌న క‌మిట‌య్యారు.
Tags:    

Similar News