రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్ ఇంకా ఎన్ని రోజులు?

Update: 2022-09-01 06:20 GMT
ల‌వ్ స్టోరీస్ ని ఏ  భాష‌లో తీసినా.. ఎప్పుడు తీసినా మంచి ఆద‌ద‌ర‌ణ ల‌భిస్తుంద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ల‌వ్ అనేది యూనివ‌ర్స‌ల్ స‌బ్జెక్ట్. అయితే దీనికీ ఓ లిమిట్ అంటూ వుంటుంది. ఏజ్ అంటూ వుంటుంది. యంగ్ ఏజ్ లో వున్న వాళ్లు చేస్తే ఆ మూవీ క‌చ్చితంగా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం గ్యారంటీ. ఇది చాలా సంద‌ర్బాల్లోనూ రుజువైంది కూడా. 90వ ద‌శ‌కం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా వ‌ర‌కు ప్రేమ‌క‌థ‌లు సూప‌ర్ హిట్ లుగా, బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిల‌చి ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

అయితే ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ప్రేమ‌క‌థ‌ల్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఏజ్ బార్ అయిన హీరోల‌తో కూడా ఈ కాలంలో ప్రేమ‌క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ముదురు హీరో.. యంగ్ లేడీ మ‌ధ్య ప్రేమ‌క‌థ.. ఇలాంటి ప్రేమ‌క‌థ‌లు ఇంకా ఎన్నాళ్లు? ...ఇప్పుడు ప్రేక్ష‌కులు ఇలాంటి ప్రేమ‌క‌థ‌ల‌కు ప‌ట్టం క‌డ‌తారా?  ప్ర‌స్తుతం మారిన ప్రేక్ష‌కుడి నాడిని బ‌ట్టి ఇలాంటి ప్రేమ‌క‌థ‌లు నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `ధ‌మాకా`. త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు జోడీగా `పెళ్లి సంద‌D` ఫేమ్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. వీరికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ద‌గ్గ‌రి నుంచే ఈ మూవీ రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అని స్ప‌ష్ట‌మైంది.

తాజాగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 39 సెక‌న్ ల గ్లింప్స్ లో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ్రీ‌లీల మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాన్ని చూపించారు. పెళ్లి మండ‌పంలో వున్న హీరోయిన్ ని ర‌వితేజ సైగ‌ల‌తో పిల‌వ‌డం.. త‌ను రాన‌ని అన‌డం క‌నిపించింది.

ఈ వ‌య‌సులో కూడా రొమాంటిక్ ల‌వ్ స్టోరీ అంటే ఆడియ‌న్స్ కి డైజెస్ట్ అవుతుందా? .. కింగ్ నాగార్జున‌ లాగ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌కు సీనియ‌ర్ హీరోలు స్కోప్ ఇస్తే బాగుంటుంది. ఇప్ప‌టికి కూడా రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్ అంటూ హీరోయిన్ ల వెంట ప‌డ‌టం... 90 వ ద‌శ‌కం త‌ర‌హాలో రొమాన్స్ ని పండించాల‌ని చూడ‌టాన్ని ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకోవ‌డం క‌ష్ట‌మే.

ఇప్ట‌పికే చాలా మంది సీరియ‌ర్ హీరోలు రొమాంటిక్ ల‌వ్ స్టోరీల జోలికి వెళ్ల‌డం లేదు. త‌మ ఏజ్ కి త‌గ్గ క‌థ‌లు, పాత్ర‌ల్ని ఎంచుకుంటూ ముందుక సాగుతున్నారు. కొంత మంది ఈ త‌ర‌హా సినిమాల‌తో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ల‌ని అందిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంటున్నారు. మిగ‌తా సీనియ‌ర్ హీరోలు .. అంటే మాస్ రాజా లాంటి హీరోలు కూడా ల‌వ్ స్టోరీస్ ని ప‌క్క‌న పెట్టి ఏజ్ కి త‌గ్గ సినిమాలు చేస్తే బాగుంటుద‌నే సెటైర్లు వినిపిస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
Tags:    

Similar News