మాస్ మహారాజా రవితేజ మరియు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ధమాకా''. 'డబుల్ ఇంపాక్ట్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.
'ధమాకా' సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ తో పాటుగా పాటల చిత్రీకరణ కూడా కంప్లీట్ అయింది. షూటింగ్ మొత్తం పూర్తయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టీమ్ అంతా కలిసి క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. షూటింగ్ పూర్తయితే కూడా సెలబ్రేషన్స్ చేయడం పైనే రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'ధమాకా' షూటింగ్ చిత్రీకరణ తర్వాత టీమ్ క్రాకర్స్ కాలిస్తే.. ఇండస్ట్రీ వర్గాలు వారిపై సెటైర్లు విసురుతున్నాయి.
కేక్ కటింగ్ చేయడం వరకూ ఓకే కానీ.. క్రాకర్స్ కాల్చడం తప్పుడు సందేశం ఇస్తుందని అంటున్నారు. రవితేజ మరియు మిగిలిన 'ధమాకా' నటీనటులు సిబ్బందిని వదిలించుకున్నందుకు ప్రొడక్షన్ టీమ్ చాలా సంతోషంగా క్రాకర్స్ కాల్చినట్లు ఉందని వ్యగ్యంగా మాట్లాడుకుంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం 'ధమాకా' టైటిల్ కు తగ్గట్టుగా అలా ప్లాన్ చేశారని.. దీపావళి కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సింబాలిక్ గా చెప్పడానికి క్రాకర్స్ కాల్చి ఉంటారని అభిప్రాయ పడుతున్నారు.
ఇదిలా ఉంటే 'ధమాకా' షూటింగ్ పూర్తవ్వడంతో మేకర్స్ ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతున్నారు. 'మాస్ రాజా' అనే సాంగ్ ని రేపు సెప్టెంబర్ 23న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే వదిలిన 'జింతాక్' పాట మరియు గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు అందించారు.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేసారు. ఎనర్జిటిక్ హీరో రవితేజ మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెషలిస్ట్ త్రినాథరావు కలిసి చేసిన 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.