చాలా కష్టాలు పడి పైకొచ్చాం అంటూ సినిమా సెలబ్రిటీలు చెబుతుంటే.. రొటీన్ గా అందరూ చెప్పేదేగా అనిపిస్తుంది. కాని వారు చేసిన కొన్ని పనులు చూస్తే మాత్రం.. వారు చెప్పే దానిలో ఉన్న ఇంటెన్సిటీ అర్ధమవుతుంది. మెగాస్టార చిరంజీవి గారిపై ఉన్న అభిమానంతో నాలుగు వందల రూపాయలతో తాడేపల్లిగూడెం నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చా అంటూనే.. ఇక్కడ తనకు సాయం చేసిన ఓ ఇద్దరిని మాత్రం మరిచిపోలేను అని చెబుతున్నాడు.
మనోడు అప్పట్లో సినిమా వేషాల కోసం ప్రయత్నిస్తూ.. మరో ప్రక్కన హోటల్లో సర్వర్ గా పనిచేశాడట. అలా అలా చూస్తుంటే చివరకు తేజ 'జై' సినిమాలో ఫస్టు ఛాన్సు వచ్చింది. ఆ తరువాత సుకుమార్ 'జగడం'లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ టైములో సుకుమార్ మాత్రమే కాకుండా.. హీరో రామ్ కూడా చాలా సాయం చేశారట. పైగా అప్పటినుండీ సుక్కూ అండ్ రామ్ ఇద్దరూ మనోడికి కావల్సినప్పుడల్లా హెల్ప్ చేస్తూనే ఉన్నారట. ''వాళ్లిద్దరి సాయం లైఫ్ లోనే ఎప్పటికీ మరచిపోలేను. అందుకే నా కొడుక్కి సుక్ రామ్ అని పేరుపెట్టా'' అంటున్నాడు ధనరాజ్.
ఆ మధ్యన సొంతంగా ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్న ధనరాజ్.. ఇప్పుడు హీరోగా మరోసారి ప్రయత్నిస్తూ.. ''బంతిపూల జానకి'' అనే సినిమాతో వస్తున్నాడు. ఈ కమెడియన్ ఈసారైనా హిట్టు కొడతాడేమో చూద్దాం.