కలిసి ఉంటే కలదు సుఖం. కానీ ఇప్పుడు జంటల తీరు మారింది. కలిసి కలతలతో ఉండే కంటే విడిపోవడం మేలని నిర్ణయించుకుంటున్నారు. ఇటీవల వరుసగా మూడు నాలుగు సెలబ్రిటీ జంటలు ఇదే తీరుగా వ్యవహరించాయి. ప్రతిరోజూ విడిపోతున్న జంటల కథలు కథనాలు అభిమానుల ఆవేదనకు కారణమవుతున్నాయి.
ఇటీవలే ప్రముఖ తమిళ హీరో ధనుష్ -ఐశ్వర్య జంట విడిపోతున్నట్టు ప్రకటించారు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ ని వెల్లడించి తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని వేడుకున్నారు. అయితే ఈ ప్రకటన అనంతరం ధనుష్ తండ్రి కస్తూరి రాజా వారు ఇంకా కలిసే ఉన్నారని అనడం చర్చనీయాంశమైంది. ఎవరికి వారు షూటింగులతో బిజీగా ఉన్నారని కస్తూరి రాజా అన్నారు.
అయితే ఆ సమయంలో ఆ ఇద్దరూ ఎక్కడ ఉన్నారు? ఏఏ షూటింగులు చేస్తున్నారు? అన్నది ఆరా తీస్తే ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. ఈ జంట విడాకుల ప్రకటన సమయంలో రామోజీ ఫిలిం సిటీలో ఒకే హోటల్ లో పక్కపక్క రూమ్ లలో ఉన్నారట. ఫిలింసిటీలోని సితార హోటల్‌లో వేర్వేరు గదుల్లో బస చేశారు. ఎవరికి వారు వృత్తిగతంగా బిజీగా ఉన్నారు. ఓ మ్యూజిక్ వీడియోను రూపొందిస్తున్న ఐశ్వర్య అక్కడే ఉండగా.. ఓ సినిమా షూటింగ్ కోసం ధనుష్ కూడా అదే పరిసరాల్లో ఉన్నారు. ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి.. శేఖర్ కమ్ములతో సినిమాలు చేసేందుకు కమిటైన సంగతి తెలిసిందే. పలు తమిళ- హిందీ చిత్రాలతోనూ బిజీ కానున్నారని తెలిసింది. ఏది ఏమైనా వృత్తిగత బిజీ లైఫ్ వ్యక్తిగత జీవితానికి కొంత ఇబ్బంది. సర్ధుకుపోయే మనస్తత్వాలు లేకపోయినా సమస్యే. అదే గాక ఇతర కారణాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. 18ఏళ్ల కాపురంలో ఇద్దరు పిల్లలు ఉండగా ధనుష్ - ఐశ్వర్య విడిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.