తమిళ స్టార్ హీరో ధనుష్ ఎవరి కొడుకనే విషయంలో నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. ధనుష్ తమ కొడుకే అంటూ మధురై జిల్లాలోని మలంపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రయివేట్ బస్ కండక్టర్ అయిన కదిరేశన్.- మీనాళ్ దంపతులు వేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. ధనుష్ ఎవరి కుమారుడో తేల్చేందుకు ఆయన ప్రాథమిక విద్య నుంచి ప్లస్ టూ వరకు పుట్టుమచ్చల వివరాలున్న విద్యార్హత సర్టిఫికెట్లు దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు మదురై శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధనుష్.. అతడి తండ్రి కస్తూరి రాజా ఎలా స్పందిస్తారో చూడాలి.
ధనుష్ తమ కొడుకే అని.. అతడి అసలు పేరు కలైసెల్వన్ అని.. సినిమాల మీద ఆసక్తితో ఇల్లు వదిలేసి చెన్నైకి వచ్చేశాడని మధురై దంపతులు అంటున్న సంగతి తెలిసిందే. ధనుష్ తమ కొడుకు అని రుజువు చేసేందుకు తాము డీఎన్ఎ టెస్టులకు కూడా సిద్ధమని వారు ప్రకటించారు. వృద్ధులైన తమకు అండగా నిలవాలని.. ధనుష్ నెల నెలా భృతి ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఐతే ధనుష్ మాత్రం తాను కస్తూరి రాజా కొడుకునేనని.. తన తల్లిదండ్రులు ఎవరో తనకు తెలుసు కాబట్తి ఈ కేసు నుంచి తనను విముక్తుడిని చేయాలని పిటిషన్లో చెప్పాడు. మరి పుట్టుమచ్చలకు సంబంధించిన వివరాలతో సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ధనుష్ రెస్పాన్స్ ఏంటో?