తమిళ హీరో ధనుష్ కు ఇంటెన్స్ యాక్టర్ అని చాలా పేరుంది. కాని అదంతా తెలుగులో మాత్రం వర్కవుట్ కావట్లేదు. ఆ మధ్యన విఐపి సినిమా తెలుగులో రఘువరన్ బి.టెక్ అంటూ రిలీజ్ చేస్తే పెద్ద హిట్టే అయ్యింది కాని.. ధనుష్ మార్కెట్ మాత్రం ఇంప్రూవ్ కాలేదు. ఇప్పుడు మనోడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగుతున్నాడు.
ధనుష్ లేటెస్ట్ సినిమా ''కోడి'' ఈ దీపావళి సందర్బంగా 28న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజున ఈ సినిమా తెలుగు వర్షన్ ''ధర్మ యోగి'' కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. తమిలంలో ''కాష్మోరా'' సినిమాతో పోటీపడి.. ఆ సినిమాకంటే ఎక్కువ ధియేటర్స్ లోనే ఈ సినిమా వస్తోంది. అయితే అక్కడ కార్తి కంటే ధనుష్ పెద్ద స్టార్ కాబట్టి.. అలాగే జరుగుతుంది. కాని తెలుగులో సీన్ వేరు. ఇక్కడ కార్తి కే ఎక్కువ ఫేస్ వాల్యూ ఉంది. అందుకే కాష్మోరా సినిమాకు ఏకంగా 600 ధియేటర్లు దక్కాయి. అందువలన తెలుగు బాక్సాఫీస్ దగ్గర ధనుష్ ఏమాత్రం పోటీపడినా కూడా అది అతడికే నష్టం.
చక్కగా తమిళంలో హిట్టు కొట్టాక సినిమాను నిధానంగా తెలుగులో మంచి డేట్ చూసి రిలీజ్ చేస్తే సరిపోయేది. గతంలో రఘువరన్ బి.టెక్ సినిమా కూడా ఇలాగే లేటుగా రిలీజైంది. ఆ సినిమా హిట్టు కొట్టలేదూ? ఏం ధనుష్ ఆ లాజిక్ మిస్సయ్యవా?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/