ధనుష్‌ సినిమాకు టెక్నికల్ దెబ్బ పడింది

Update: 2016-10-27 14:29 GMT
ఈ శుక్రవారం ఆమీతూమీ తేల్చుకోవడానికి వచ్చేస్తున్నాడు ధనుష్‌. మనోడు తమిళంలో ''కోడి'' అంటూ రంగంలోకి దిగుతూ.. ఈసారి లేట్ చేయకుండా తెలుగులో కూడా అదే టైముకు తెలుగు వర్షన్ ''ధర్మ యోగి''ని రిలీజ్ చేస్తున్నాడు. తమిళంలో తనకు ఏ రేంజ్ ఆధిపత్యం ఉన్నప్పటికీ.. తెలుగులో మాత్రం ''కాష్మోరా'' సినిమాతో పోటీ తప్పట్లేదు.

ఇదంతా సరే.. లాస్ట్ మినిట్ లో ఇప్పుడు షాక్ ఇచ్చాడు ధనుష్‌. కొన్ని టెక్నికల్ కారణాల వలన ''ధర్మ యోగి'' రిలీజ్ ఆగిపోయిందట. ధనుష్‌ డబుల్ యాక్షన్ చేస్తున్న ఈ సినిమాను తమిళంలో యథావిథిగా రిలీజ్ చేస్తున్నారు కాని.. తెలుగులో మాత్రం రిలీజ్ చేయట్లేదు. అయితే రిలీజ్ పెద్ద దూరానికి పోస్ట్ పోన్ అవ్వట్లేదులే. శనివారం రిలీజ్ అయిపోతోంది అని తెలుస్తోంది. ఇంతకీ ధనుష్‌ కు పడిన ఆ టెక్నికల్ దెబ్బ ఏంటంటారు?

ఒకటి.. లోకల్ ప్రొడ్యూసర్ ఏమన్నా డబ్బులు క్లియర్ చేయకపోతే సినిమా రిలీజ్ వాయిదాపడి ఉండొచ్చు. రెండు.. ఒకవేళ మనోళ్లు కాష్మోరా సినిమా టాక్ చూసి అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నా అనుకొని ఉండొచ్చు. ఏదేమైనా కూడా రేపు కేవలం కాష్మోరాతో టైమ్ స్పెండ్ చేయాల్సిందే. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News