హిట్టు కొట్టకపోయినా గోల్డ్‌ కొట్టేశారు

Update: 2015-07-23 16:25 GMT
ధనుష్‌ ఇటీవలి కాలంలో తిరుగులేని విజయాలు అందుకుంటూ తమిళ బాక్సాఫీస్‌ ని గడగడలాడించాడు. అతడు నటించిన విఐపి పెద్ద హిట్‌ అక్కడ. అదే సినిమాని రఘువరన్‌ బిటెక్‌ పేరు తో తెలుగు లో రిలీజ్‌ చేసి హిట్‌ కొట్టారు. అయితే ఇదే హుషారు లో ధనుష్‌ నటించిన తాజా చిత్రం 'మారి' కూడా పెద్ద హిట్టయిపోతుందని భావించారు.

ఒకవేళ తమిళ్‌ లో పెద్ద విజయం సాధిస్తే తెలుగు, హిందీలో కూడా ఈ సినిమాని అనువదించి రిలీజ్‌ చేయొచ్చని అనుకున్నారు. కానీ అచ్చులో బొమ్మ తిరిగింది. మారి పరాజయం పాలైంది. దాంతో ఈ చిత్రం తెలుగులో రిలీజవుతుందా? అన్న సందేహాలొచ్చాయి. అయితే విచిత్రంగా ఇటీవలే ధనుష్‌ చెన్నయ్‌ లో ఓ సక్సెస్‌ మీట్‌ పెట్టి చిత్రయూనిట్‌ లో కీలక సభ్యులకు బంగారు గొలుసులు పంచిపెట్టాడు. అందులో దర్శకుడు బాలాజీ మోహన్‌, నటులు విజయ్‌ ఏసుదాసు, రోబో శంకర్‌, వినోద్‌ తదితరులు ఉన్నారు.

ధనుష్‌ ఇలా బంగారం పంచిపెట్టాడంటే గోల్డ్‌ ధరలు తగ్గడం వల్లేనా? అని జోకులేసుకుంటున్నారంతా. హిట్టు కొట్టకపోయినా టీమ్‌ మెంబర్స్‌ గోల్డ్‌ కొట్టేశారంటూ నవ్వుకుంటున్నారంతా. ధనుష్‌ కథానాయకుడిగా విఐపి 2, వడ చెన్నయ్‌ ఆన్‌ సెట్స్‌ ఉన్నాయి.
Tags:    

Similar News