మీ మొహం... ధనుష్ నెం.1, అల్లు అర్జున్‌ నెం.9 ఏంట్రా?

Update: 2022-12-08 05:31 GMT
సినిమాలకు మరియు సిరీస్ లకు రివ్యూలు ఇచ్చే వెబ్‌ సైట్స్ ఎన్నో ఉన్నా కూడా చాలా మంది విశ్వసించేది #IMDb అనే విషయం తెల్సిందే. యూజర్లు రేటింగ్‌ ఇవ్వడం వల్ల దీనికి ఎక్కువ విశ్వసనీయత ఉంటుందని అంతా భావిస్తూ ఉంటారు. కానీ తాజాగా #IMDb తన వార్షిక సెలబ్రిటీల జాబితా ను విడుదల చేసిన తర్వాత దాని యొక్క విశ్వసనీయత కోల్పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ ఏడాదిలో మేటి సెలబ్రెటీలు ఎవరు అనే విషయాన్ని జనాల యొక్క రేటింగ్‌ ఆధారంగా విడుదల చేయడం జరిగింది. ఆ జాబితా ను చూసి తెలుగు ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకులు అయితే ఏకంగా నోరు వెళ్లబెడుతున్నారు. అత్యధిక ప్రజాధరణ కలిగిన సెలబ్రెటీల టాప్ 10 జాబితాలో బాలీవుడ్‌ కు చెందిన.

టాప్ 10 లో బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్ ఒకే ఒక్కరు ఉన్నారు. హీరోయిన్ లు ఆలియా భట్‌.. కియారా అద్వానీ మరియు ఐశ్వర్య రాయ్ కి ఛాన్స్ దక్కింది. బాలీవుడ్‌ కు చెందిన ఈ నలుగురు టాప్‌ 10 లో ఉన్నారు. ముఖ్యంగా నెం.1 స్థానంలో ధనుష్ ఉండటం ఆశ్చర్యంగా ఉంది అంటూ తెలుగు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నాయి.

తెలుగు స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌... ఎన్టీఆర్‌ మరియు అల్లు అర్జున్ లకు ఛాన్స్ దక్కింది. కానీ వారికి వరుసగా నాలుగు.. ఎనిమిది మరియు తొమ్మిది స్థానాలు దక్కాయి. ధనుష్‌ కు నెం.1 స్థానం దక్కి అల్లు అర్జున్‌ కు నెం.9 ఇవ్వడం ఏంట్రీ బాబు అంటూ #IMDb పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పోలింగ్‌ ట్యాంపర్ అయ్యింది.. లేదంటే #IMDb విశ్వసనీయత లేకుండా వ్యవహరిస్తుందని.. పక్షపాత వైఖరి ని కలిగి ఉంది అంటూ కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి #IMDb యొక్క టాప్‌ 10 జాబితా ను తాము గుర్తించడం లేదని.. నమ్మడం లేదని.. నిజం కాదని చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా విమర్శలు చేస్తున్నారు.

ముందు ముందు కూడా #IMDb యొక్క రేటింగ్‌ లను మరియు రివ్యూలను కూడా నమ్మాలని తాము భావించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ జాబితా తో #IMDb యొక్క మొత్తం విశ్వసనీయత కోల్పోయింది అన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News