ఇప్పుడు కేవలం హీరోగానే కాకుండా.. రకరకాల వేషాలు వేస్తున్నాడు ధనుష్. మనోడు ఆ మధ్యన సడన్ గా బాలీవుడ్ లో హీరో అయిపోయాడు. కట్ చేస్తే తమిళనాట అన్నీ ఫ్లాపులే వస్తుండటంతో.. మళ్లీ ఇక్కడ తిష్టేశాడు. ప్రొడ్యూసర్ గా కొన్ని సినిమాలను తీశాడు. ఇప్పుడు తను రచించిన కథలతో ఇతరులకు డైరక్షన్ కూడా అప్పజెప్పుతున్నాడు. అంతేకాదు.. తనే ఒక సినిమాను డైరక్ట్ కూడా చేసేస్తున్నాడు.
''పవర్ పాండి'' అంటూ ఒక సినిమాను డైరక్ట్ చేసేశాడు ధనుష్. తెలుగులో రచ్చ సినిమాలో కనిపించిన తమిళ స్టార్ రాజ్ కిరణ్ లీడ్లో తీసిన ఈ సినిమాలో.. రాజ్ కిరణ్ ఒక 64 ఏళ్ల భార్యలేని వ్యక్తి. మనోడు తన కొడుకుతో.. మనువడితో.. అలాగే తనకు మనస్సైన ఒక పెద్దావిడతో (రేవతి) జరిపే డ్రామానే ఈ సినిమా. చూస్తుంటే కాన్సెప్టు ఇంట్రెస్టింగానే ఉందిలే. అయితే ఇలాంటి సినిమాలకు గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ఉంటేనే ఎక్కుతాయి. మరి ఆ యాంగిల్లో ధనుష్ ఏం చేస్తాడో చూడాలి.
ఓవరాల్ గా సినిమా ట్రైలర్ బాగుంది కాని.. ఒక పెద్దాయన కథను చెబుతున్నప్పుడు ధనుష్ ఇటు రొమాంటిక్ యాంగిల్లో తీస్తున్నాడో అటు యాక్షన్ యాంగిల్లో తీస్తున్నాడో మాత్రం అర్ధంకాలేదు. చూద్దాం సినిమా ఏమవుతుందో!!
Full View