మజిలీ అక్కడ వర్క్ అవుట్ అవుతుందా?

Update: 2019-04-17 04:11 GMT
మండు వేసవిలో మొదటి హిట్ గా నిలిచిన మజిలీ వసూళ్ల పరంగా ఇంకా స్టడీగానే ఉంది. తర్వాత చిత్రలహరి వచ్చినా దాని ప్రభావం అంత తీవ్రంగా ఏమి లేకపోవడంతో అక్కినేని జంటదే డామినేషన్ అయ్యింది. ఇప్పుడు దీని రీమేక్ కోసం ఇతర బాషల నుంచి ప్రయత్నాలు మొదలయ్యాయి. తమిళ్ లో ధనుష్ తో దీన్ని రీమేక్ చేసేందుకు ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందని చెన్నై టాక్. అయితే ధనుష్ దీన్ని అంత సులువుగా ఒప్పుకోకపోవచ్చు.

కాస్త ఇలాంటి ఛాయలున్న కథలో గతంలో మయక్కం ఎన్న అనే సినిమా చేశాడు ధనుష్. అప్పడది పెద్ద హిట్టు. కొంతకాలం తర్వాత తెలుగులో మిస్టర్ కార్తీక్ పేరుతో డబ్ చేశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. మజిలీలో హీరో క్రికెటర్ అయితే అందులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. మెయిన్ లైన్ పోలిక తప్ప మిగిలిన విషయాల్లో కొన్ని తేడాలుంటాయి. తర్వాత ఇలాంటి భార్యా భర్తల బాండింగ్ మీద తంగమగన్(నవ మన్మధుడు)కూడా చేశాడు ధనుష్

సో మజిలీ లాంటి సబ్జెక్టు ఒకరకంగా తనకు రిపిటీషన్ లాగా ఫీలైతే ధనుష్ నో చెప్పేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న ధనుష్ అప్పుడెప్పుడో తమిళ్ లోనే వచ్చిన మౌనరాగం షేడ్స్ లో ఉన్న మజిలీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంత ఈజీ కాకపోవచ్చు. ఇది తేలడానికి కొంత టైం అయితే పడుతుంది.

చెన్నై లాంటి మెయిన్ సెంటర్స్ లో మజిలీ స్ట్రెయిట్ తెలుగు వెర్షన్ సబ్ టైటిల్స్ తో ఆడుతూ బాగానే వసూళ్లు తెచ్చుకుంది. అవి చూసాకే రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చి ఉంటుంది కాబోలు. కన్నడలో గణేష్ హీరోగా దీని రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వినికిడి. మొత్తానికి తన సినిమా రీమేక్ కోసం పోటీ పడే హిట్ అయితే చైతు కొట్టేశాడు
Tags:    

Similar News