ధనుష్ రావట్లేదండీ!!

Update: 2017-07-21 05:55 GMT
తెలుగులో ఇప్పుడు సినిమా పండుగ మొదలైంది. జూలై నెల చివరి రోజులు నుండి దసరా వరకు ఇంకా సినిమాలు వరుసపెట్టి విడుదల కాబోతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా పండుగ  కొంతమందికి భయాన్ని మరి కొంతమందికి కంగారూ పుట్టిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఇన్ని సినిమాలు ఒక వారం తరువాత ఒకటి విడుదల అవుతూనే ఉంటాయి రానున్న కొన్ని వారాలు. దానితో కొన్ని సినిమాలకు ఎప్పుడు ఏ తేదిలో విడుదల చేయాలో తేల్చుకోలేని అయోమయంలో పడిపోయారు.

తమిళ్ యంగ్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు హీరో అయిపోయాడు. రఘువరన్ బి.టెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు బాగా దగ్గర అయ్యాడు. ఇప్పుడు అదే సినిమాకు విఐపి 2 అనే సీక్వెల్ వస్తోంది. ఈ సినిమా ఇప్పుడు ఒక తెలుగు సినిమా విడుదల అవుతుంది అన్నంతగా హంగామా చేస్తోంది. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి మెరుపు కలలు సినిమా హీరోయిన్ కాజోల్ విలన్ గా నటిస్తుంది. అయితే ఈ నెల 28 నాడు విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన ఈ సినిమాను.. తెలుగు వర్షన్ కొంచం ఆలస్యం అయేటట్లు కనిపిస్తుంది. అదే రోజు నాడు కొన్ని తెలుగు సినిమాలు విడుదలకావడంతో పైగా తెలుగు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొన్ని మిగిలి ఉండడంతో జూలై 28 నాడు కాకుండా ఆగష్టు నెలలో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారట.

అయితే ఆగస్టు.. సెప్టెంబర్.. అక్టోబర్ నెలల్లో తెలుగు సినిమాల దాటి చాలా గట్టిగా ఉంది. అందుకే తేదీ ఎప్పుడు అనేది ఒక నిర్దిష్టమైన ఆలోచనకు రాలోకపోతున్నారట. ఇప్పుడు తెలుగు రిలీజ్ కోసం మరి తమిళ రిలీజ్ ను కూడా వాయిదా వేస్తారా? అది కూడా చూడాల్సి ఉంది.
Tags:    

Similar News