రజనీపై ధోనీకున్న అభిమానం ఇది!!

Update: 2016-09-24 05:42 GMT
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ప్రస్తుతం "ఎంఎస్ ధొనీ" సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో ఉన్న ధోనీ అక్కడి స్టార్స్ అందరినీ కలుస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో సూర్య భార్య జ్యోతిక, వారి పిల్లలను థియేటర్ లో కలుసుకున్న ధోనీ.. "రజనీ సార్ తర్వాత మీ నాన్నే నా ఫేవరెట్ హీరో" అని ఆ పిల్లలతో అన్నాడు. ఈ సందర్భంగా రజనీ డైలాగులు వచ్చా అని అడిగిన పిల్లలకు షాక్ ఇచ్చాడు ధోనీ. రజనీ కాంత్ డైలాగులు కూర్చుని చెబితే బాగోదు - నిల్చొని చెబితే గౌరవంగా ఉంటుందని చెప్పి కుర్చీలోంచి లేచి మరీ "నరసింహ" సినిమాలో డైలాగ్.. "ఎన వళి తనీ వళి" - నా దారి రహదారి అని రజనీ స్టైల్లో చెప్పాడు ధోని.

అనంతరం తలైవర్ ని కలవడానికి వెళ్లిన ధోనీ - ఆ సమయంలో రజనీపై తనకున్న గౌరవాన్ని - అభిమానాన్ని చెప్పాడు. తనకు చెన్నై రెండో ఇల్లుగా మారిందని - చెన్నైకి ఎప్పుడు వచ్చినా రజనీ కాంత్ ని కలవాలని మనస్సులో ఉండేదని, కాకపోతే ఎవరినైనా అడుగుదామని అనుకుంటే సిగ్గుగా ఉండేదని.. అందుకే ఇన్నాళ్లూ కలవలేకపోయానని.. అయినా పర్లేదు, ఈ రోజు కలుస్తున్నందుకు సంతోషంగా ఉందని గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చాడు ధోని. అనంతరం నటుడు ధనుష్‌ ఇంట్లో రజనీకాంత్ ని కలుసుకున్నాడు ధోని.

ఈ సందర్భంగా ధోనీతోపాటు ‘ఎంఎస్‌ ధోనీ’ హీరో సుశాంతసింగ్‌ - నిర్మాత - ధోనీ స్నేహితుడు అరుణ్‌ పాండే కూడా రజనీని కలుసుకున్నవారిలో ఉన్నారు. ధోనీని ఎంతో సాదరంగా ఆహ్వానించి - ఆత్మీయంగా పలకరించిన రజనీకాంత్.. అనంతరం శాలువాతో సత్కరించారు.
Tags:    

Similar News