'బాహుబలి' అభిమానుల్లో మరో ప్రముఖుడు చేరాడు. టీమ్ఇండియా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నాడట. 'బాహుబలిః ది కంక్లూజన్' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట. అతను బాహుబలిః ది బిగినింగ్ సినిమా కూడా చూశాడట. మన దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి తన బయోపిక్ ఎం.ఎస్.ధోని ఆడియో రిలీజ్ చేసిన ధోని.. ఈ కార్యక్రమంలో బాహుబలి ప్రస్తావన తెచ్చాడు.
''గతంలో ఓ సౌత్ ఇండియన్ సినిమా చూశాను. ఇక గత ఏడాది బాహుబలి చూశాను. బాగా నచ్చింది. 'బాహుబలి' సీక్వెల్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దక్షిణాదిన మంచి నటులున్నారు. ఇక్కడి సినిమాలు చాలా వరకు బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతున్నాయి''అని ధోని అన్నాడు.
ఇక హైదరాబాద్ నగరం మీదా తన ప్రేమను చాటుకున్నాడు ధోని. ''ఐ లవ్ హైదరాబాద్.. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మొదట హైదరాబాద్ బిర్యానీయే గుర్తొస్తుంది. 'హైదరాబాద్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు తొలిసారి ఇక్కడి బిర్యానీని రుచిచూశాను. ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడికీ వచ్చినా బిర్యానీ మిస్ అయ్యేవాడిని కాదు. బిర్యానీతోపాటు హైదరాబాద్‌లో బేకరీ బిస్కట్లు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడి గాజులకు మంచి పేరుంది''అంటూ మన నగర ముచ్చట్లు చెప్పాడు ధోని.