చ‌ర‌ణ్ విష‌యంలో ఫుల్ హ్యాపీ

Update: 2016-06-11 08:05 GMT
సురేంద‌ర్ రెడ్డి ధ్రువ టీమ్‌ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ సినిమాని పూర్తి చేశాడు. మూడో షెడ్యూల్ కోసం త్వ‌ర‌లోనే కాశ్మీర్ వెళ్ల‌బోతున్నారు. ఈ స్పీడుకీ - జోరుకీ కార‌ణం రామ్‌ చ‌ర‌ణ్ ఎనర్జీనే అన్న‌ది సురేంద‌ర్ రెడ్డి మాట‌. చ‌ర‌ణ్ ఉన్నాడంటే సెట్లో అంద‌రూ ఉత్సాహంగా ఉంటారని ఆయ‌న ఇటీవ‌ల ఫేస్‌ బుక్ ద్వారా తెలియ‌జేశారు. నిన్న‌టివ‌ర‌కు శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ స‌మీపంలో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. రామ్‌ చ‌ర‌ణ్ ఆ సన్నివేశాల్లో అద‌ర‌గొట్టాడట‌. చిత్ర‌బృందంలోని కొద్దిమంది స్వ‌యంగా ఆ విష‌యాన్ని వెల్ల‌డించారు.

 త‌ని ఒరువ‌న్‌ కి రీమేక్‌ గా తెర‌కెక్కుతున్న చిత్ర‌మే ధ్రువ‌. ఈ సినిమా కోసం రామ్‌ చ‌ర‌ణ్ త‌న స్టైల్ మొత్తం మార్చేశాడు. అథ్లెట్ బాడీని సిద్ధం చేయ‌డంతో పాటు - మీస‌క‌ట్టులోనూ మార్పులు చేసుకొన్నాడు. దీంతో ఆయ‌న తెర‌పై ఇదివ‌ర‌క‌టికంటే  కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. సినిమాకీ  కొత్త ఫ్లేవ‌ర్ యాడ్ అయిన‌ట్టైంది. ప్రోగ్రెస్‌ తోపాటు ఫేస్‌ బుక్‌ లో ధ్రువ ఫ‌స్ట్‌ లుక్‌ ని కూడా విడుద‌ల చేశాడు సురేంద‌ర్ రెడ్డి.  జంజీర్ త‌ర్వాత పోలీసు పాత్ర‌లో రామ్‌ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్ర‌మిది. యాక్ష‌న్‌ తోపాటు మైండ్‌ గేమ్‌ కి ప్రాధాన్య‌మున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికీ భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇందులో చెర్రీ స‌ర‌స‌న ర‌కుల్‌ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది.
Tags:    

Similar News