ధృవ.. రచ్చ మొదలెట్టేశావా!!

Update: 2016-11-30 17:30 GMT
డిసెంబర్ 9న రామ్ చరణ్ మూవీ ధృవ రిలీజ్ కానుండడంతో.. మెగాభిమానుల్లో ఇప్పటికే హంగామా మొదలైపోయింది. దసరా పండక్కే రిలీజ్ కావాల్సిన ఉన్న ఈ మూవీ.. రెండు నెలలు లేటుగా వస్తున్నా.. అన్ని రకాల హంగులు పూర్తి చేసుకుని.. అల్ట్రా స్టైలిష్ గా రూపొందిందనే వార్తలు రావడంతో.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఊగిపోతున్నారు.

ధృవ ప్రమోషన్స్ లో భాగంగా నవంబర్ 1నుంచే హంగామా స్టార్ట్ చేసేశారు. వరుసగా సాంగ్ ప్రోమోస్ రిలీజ్ చేస్తూ.. నెలరోజుల పాటు హంగామా చేద్దామని భావిస్తే.. డీమానిటైజేషన్ కారణంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మూవీ రిలీజ్ కి మరో పది రోజులు మాత్రమే ఉండడం.. నాలుగు రోజులలో  ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయనుండడంతో.. ప్రమోషనల్ యాక్టివిటీస్ తిరిగి ప్రారంభించాడు చెర్రీ. టీవీ ఇంటర్వ్యూలు ఇప్పటికే ఇచ్చేస్తుండగా.. ధృవ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయంటున్నాడు నిర్మాత అల్లు అరవింద్.

ఇప్పటికైతే చరణ్ ఇంటర్వ్యూలతో మొదలుపెట్టి.. రోజుకో రకంగా పబ్లిసిటీ హంగామా చేయనున్నారట. చరణ్ ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వనుండగా.. త్వరలో దర్శకుడు సురేందర్ రెడ్డి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా ప్రచారంలో దిగిపోనున్నారు.  డిసెంబర్ 9న ధృవ రిలీజ్ వరకూ ఈ రచ్చ నాన్ స్టాప్ గా ఉండనుందిట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News