మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ సినిమా విడుదలకు దగ్గరపడే కొద్దీ ఇంటెన్సిటీని పెంచుతుంది. టీజర్ తోగతంలో తళుక్కున తన స్టామినా ఏమిటో చూపించిన చెర్రీ నిన్న విడుదలచేసిన ట్రైలర్ తో తన క్రేజ్ ని మరోమారు రుజువుచేసుకుని రికార్డుల వర్షం కురిపించాడు.
అల్ట్రా స్టైలిష్ గా సాగిన ఈ ట్రైలర్ అందరినీ అలరిస్తుంది. కేవలం 4.5 గంటల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని TFIలో కొత్త రికార్డు సృష్టించింది. అంతేకాక ప్రస్తుతం యు ట్యూబ్ లో ధృవ ట్రైలర్ నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండ్ అవ్వడం విశేషం. ఇక హ్యాష్ ట్యాగ్ ల మాట మామూలే. ఈ క్రమంలో రామ్ చరణ్ అఫీషియల్ పేజ్ సైతం 4మిలియన్ లైక్లను అందుకుంది.
ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదలకావడానికి సిద్ధమవుతుంది. చరణ్ కి తప్పనిసరిగా హిట్ కావలసిన సందర్భంలో ధృవ విడుదల అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.