ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ట్వీట్ చేసింది. నీటి ఉపయోగంపై తన అభిప్రాయాన్ని షేర్ చేసింది. 'మనం నివసిస్తున్న ప్రాంతాల్లోనే అనేక తేడాలున్నాయి. నీళ్లు లేక కరువు రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ మరికొంతమంది అదే నీటిని హోలీ పేరుతో ఆడుకుంటున్నారు. ఓకే.. ఇకపై నన్ను హిందూ వ్యతిరేకి అని పిలవండి' అంటూ ట్వీట్ చేసింది దియా మీర్జా.
దియా ట్వీట్ కు మద్దతు చాలా మంది నుంచే వచ్చినా.. అంతకు మించి వ్యతిరేకత వ్యక్తమయింది. హిందూ పండగ సందర్భంగా చేసిన ట్వీట్ కావడంతో.. విమర్శలు వెల్లువెత్తాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేసుకొచ్చారు. దీంతో తన అభిప్రాయంపై ఓ సుదీర్ఘ వివరణ ఇచ్చింది దియా.
'నేను ఒక వ్యక్తినో, కమ్యూనిటినో కించపరిచేందుకు, మనోభావాలను దెబ్బ తీసేందుకు ఈ ట్వీట్ చేయలేదు. మన దేశంలోని 43,000 గ్రామాల్లో ప్రజలు నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పండుగ చేసుకోవద్దని కాదు.. వీలైనంత తక్కువ వృథా ఉండేలా నేర్పించమని చెబుతున్నా. నా ట్వీట్ ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే.. వారికి మనసారా క్షమాపణలు కోరుకుంటున్నా' అంటూ ఫేస్ బుక్ లో వివరణ ఇచ్చింది దియా మీర్జా.