బాలీవుడ్ మీడియా అత్యుత్సాహం అనాలా? లేక దుందుడుకు అనాలా? ఎఫైర్ వార్తలతో నిరంతరం హాట్ టాపిక్ గా మారడం ఒక్కటే అక్కడ మీడియా ఉద్ధేశమా? కారణం ఏదైనా ముంబై లోని ఓ ప్రముఖ దినపత్రిక ట్యాబ్లాయిడ్ లో వచ్చిన వార్త కలకలం రేపుతోంది. సదరు పత్రిక ప్రచురించిన కథనంపైనా.. ఆ ఎఫైర్ రూమర్ పైనా ఇద్దరు కథానాయికలు తమదైన శైలిలో సీరియస్ అవ్వడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఇంతకీ ఆ పత్రికలో ఏం రాశారు? ఎవరిపై రాశారు? అంటే..
దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక నుంచి విడాకులు తీసుకోవడానికి కారణం దియ మీర్జా భర్త సాహిల్ సంఘాతో ఆమె సాన్నిహిత్యమేనని అంటూ ఆ కథనం పేర్కొంది. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక.. హైదరాబాదీ అయిన దియా మిర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్న విషయాన్ని నిన్ననే(గురువారం) అధికారికంగా ధృవీకరించారు. తమ దారులు వేరని అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. అయినా మేం స్నేహంగానే ఉన్నామని దియా ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇంతలోనే ప్రముఖ పత్రికలో ఈ విడాకుల వెనక అసలు కారణం వేరే! అంటూ కథనాన్ని ప్రచురించడం సంచలనమైంది. సాహిల్ సంఘాతో `జడ్జిమెంటల్ హై క్యా` రచయిత్రి కనిక థిల్లాన్ సాన్నిహిత్యమే ఈ విడాకులకు కారణమైందని కథనం ప్రచురించింది.
అయితే ఈ ప్రచారంపై దియా మీర్జా సీరియస్ అయ్యారు. తన భర్త సాహిల్ సంఘాతో విడాకులు తీసుకోవడానికి తమ మధ్య మూడో వ్యక్తి ఎవరూ కారణం కాదని దియా ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఐదేళ్ల దాంపత్యం తర్వాత భర్త నుంచి విడిపోవడానికి కారణం తమ దారులు వేరని వెల్లడించారు. కనిక థిల్లాన్ తో ఎఫైర్ అంటూ రాయడంపై మనస్తాపానికి గురైన దియా ఇవి నిరాధారం అని కొట్టి పారేశారు. ఈ ప్రచారానికి కనికా థిల్లాన్‌కు సారీ చెప్పారు. కనిక థిల్లాన్ సైతం ఈ వార్తలపై స్పందించారు. ఎలాంటి నిజం లేకుండా ఇలాంటి వార్తల్ని ఎలా ప్రచురిస్తారని సదరు పత్రికపై కనిక మండి పడ్డారు. నా జీవితంలో ఎప్పుడూ దియాను కానీ.. సాహిల్ ని కానీ కలవనే లేదని కనిక సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2014లో కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి.. కథారచయిత కనిక థిల్లాన్ వివాహం జరిగింది. ఈ జంట విడిపోయారంటూ ప్రస్తుతం ప్రచారం సాగుతోంది.