సెన్సార్‌ టాక్‌: కోతలు లేని డిక్టేటర్‌

Update: 2016-01-06 07:59 GMT
అసలు బాలయ్య బాబు సినిమా అంటేనే అక్కడ చాలా మందికి చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి. ఇక ప్రక్కన డిక్టేటర్‌ లో ఎటువంటి పొలిటికల్‌ డైలాగులు ఉంటాయి అంటూ కొందరు భయపడుతుంటే.. మరో ప్రక్కన ఈ సినిమాలో పంచ్‌ లతో పాటు గ్లామర్‌ పాళ్లు కూడా విపరీతంగా ఉండే ఛాన్సుందని ఒక టాక్‌. ఇవన్నీ ఎలా ఉన్నా.. మితిమీరితే మాత్రం సెన్సార్‌ లో కోత పడక తప్పదు.

ఈరోజు ఉదయం 9.27 ని.లకు.. ఒక స్పెషల్‌ ముహూర్తం నాడు.. బాలయ్య ''డిక్టేటర్‌''ను సెన్సార్‌ ఎగ్జామినింగ్‌ కమిటీ చూసింది. సినిమాలో ఓ రెండు మూడు చోట్ల డైలాగుల పదాలను మ్యూట్‌ చేయడం తప్పిస్తే.. అసుల సినిమాకు సంబంధించి ఒక్క కట్‌ కూడా చెప్పలేదట. ఔట్ పుట్‌ చూసిన సెన్సార్‌ కమిటీ.. యు/ఎ సర్టిఫికేట్‌ కూడా జారీ చేసేసింది. దీనితో జనవరి 14న డిక్టేటర్‌ రాకకు అంతా క్లియర్‌ అయినట్లే.

ఇకపోతే సంక్రాంతి పుంజుల్లో ఇప్పటికే ఎక్స్‌ప్రెస్‌ రాజా - సోగ్గాడే చిన్ని నాయనా - ఎక్స్‌ప్రెస్‌ రాజా సినిమాలకు క్లియరెన్స్‌ వచ్చేసింది. నాన్నకు ప్రేమతో సెన్సార్‌ ఒకటే పెండింగ్‌.
Tags:    

Similar News