నందమూరి వార్‌.. షురూ అయినట్లే

Update: 2015-10-23 08:51 GMT
నందమూరి వార్‌.. బాక్సాఫీస్‌ దగ్గర ఇలాంటి వార్‌ మనం ఇంతవరకు చూడలేదు. ఈ మధ్యకాలంలో మెగా వార్‌ అయితే ఓ రెండు మూడుసార్లు చూశాం. ఒక మెగా హీరో సినిమా వచ్చిన వారానికే మరో మెగా మూవీ కూడా వచ్చేస్తోంది. రుద్రమదేవి - బ్రూస్‌ లీ - కంచె ఇదే కోవకు చెందుతాయి. అయితే ఈ పరిణామం మంచిదా కాదా అనే విషయం పక్కనెట్టేస్తే.. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ కూడా ఇలాంటి వార్‌ చూడబోతోంది.

వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఆల్రెడీ జనవరి 8న ''నాన్నకు ప్రేమతో'' సినిమాతో రానున్నట్లు జూ.ఎన్టీఆర్‌ కన్ఫాం చేసేశాడు. ఎప్పటినుండో ఈ రిలీజ్‌ డేట్‌ ను ప్రచారంలోకి కూడా తెచ్చేశారు. అయితే పెద్దసినిమాల మధ్యన కనీసం రెండు వారాల గ్యాప్‌ అయినా ఉండాలని మహేష్‌-చరణ్‌ వంటి స్టార్లు అండర్ స్టాండింగ్‌ తో కథను నడిపిస్తుంటే.. ఇప్పుడు బాలయ్య ''డిక్టేటర్‌'' మాత్రం అందుకు లొంగుతుందో లొంగదో తెలియట్లేదు.

ఖచ్చితంగా సంక్రాంతి 2016 కే వస్తున్నాం అంటూ ఈరోజే డిక్టేటర్‌ టీం డిక్లేర్‌ చేసింది. వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందా.. టూ సైడ్‌ అవుతుందా తెలియదు కాని.. ఇలా జూ.ఎన్టీఆర్‌ సినిమా వచ్చిన వారానికే బాలయ్య సినిమా వస్తే మాత్రం.. ఎవరో ఒకరి రెవెన్యూలు మరొకరు తినేసే ఛాన్సుందని అభిప్రాయ పడుతున్నారు ట్రేడ్‌ వర్గాలు. మరి ఈ నందమూరి వార్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూద్దాం.
Tags:    

Similar News