సీనియర్ హీరోల హవా తగ్గి చాలా కాలమైంది. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు లాంటి తర్వాతి తరం హీరోలు, యువ కథానాయకులదే హవా. రెండు దశాబ్దాల పాటు హవా సాగించిన చిరంజీవి తరం జోరు దాదాపుగా తగ్గిపోయింది. చిరు సినిమాలు మానేస్తే మిగతా వాళ్లు యంగ్ జనరేషన్ పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఐతే ఆ జనరేషన్ హీరోల్లో మిగతా వాళ్లతో పోలిస్తే బాలయ్య బెటర్. ఇప్పటికీ మాంచి సినిమా పడితే బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తెలుస్తూనే ఉంటుంది. బాలయ్య చివరి సినిమా ‘లయన్’ దారుణమైన ఫలితాన్ని చూసినప్పటికీ ఆయన న్యూ మూవీ ‘డిక్టేటర్’మీద మాత్రం ట్రేడ్‌లో మంచి డిమాండే కనిపిస్తోంది.
శ్రీవాస్ - కోన వెంకట్ - గోపీమోహన్‌ల క్రేజీ కాంబినేషన్ వల్లో ఏమో.. ‘డిక్టేటర్’ మీద లయన్ ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా రూ.40 కోట్ల బిజినెస్ జరిగిందట ఈ సినిమాకు. బాలయ్య లాస్ట్ హిట్టు ఫుల్ రన్ లో రూ.40 కోట్ల మార్కును అందుకుంది. ఆ బెంచ్ మార్క్ పెట్టుకుని బయ్యర్లు సినిమాను కొన్నారు. సినిమా మీద ఉన్న హైప్.. సంక్రాంతి సెలవుల అడ్వాంటేజీ దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు పెద్ద సాహసమే చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. బిజినెస్ ను మించి వసూళ్లు రావడం కష్టమేమీ కాదు. కానీ సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నెగెటివ్ టాక్ వస్తే మాత్రం కష్టం. ‘లయన్’ విషయంలో బయ్యర్లు నష్టపోయారు. మరి‘డిక్టేటర్’ ఎలాంటి ఫలితాన్నిస్తాడో చూడాలి.