నటసింహా బాలకృష్ణ హీరోగా 99వ చిత్రం డిక్టేటర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో బాలయ్య ఇమేజ్ కు ఏ మాత్రం తగ్గకుండా కమర్శియల్ హంగులతో దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ యూ ట్యూబ్ లో సెన్షేషన్ సృష్టించాయి. డిక్టేటర్ బిజినెస్ లోనూ దూసుకుపోయింది. ముందస్తుగానే మూవీపై భారీ అంచనాలేర్పడ్డాయి. వందకు ఒక్క అడుగు దూరంలో ఉన్న బాలయ్య ఎలాగైన హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు.
ఇటీవలే హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో క్లైమాక్స్ ఫైట్ ని చిత్రీకరించారు. ఈ షూట్ లో దాదాపు 150 మంది ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు. ఈ సీన్స్ కోసం భారీగా సుమోల్ని కూడా ఉపయోగించారు. పోరాట సన్నివేశాల్లో ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా పెట్టుబడులు సమకూర్చారు. నిన్నటితో క్లయిమాక్స్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ నెల 20న ఆడియో కార్యక్రామాన్ని అమరావతిలో భారీ ఎత్తున జరపనున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
షూటింగ్ ఏమైనా లేట్ అవుతోందా అంటూ ఖంగారుపడుతోన్న అభిమానులకు ఈ విషయం గుడ్ న్యూస్ మరి. సినిమా ఎలాగో వచ్చేస్తోంది కాబట్టి.. మరి రికార్డుల కోసం ఏం చేస్తారో ఓమారు థింకింగ్ చేసుకోండిక!!