ఇటీవలే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ మరో చిత్రం చేస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఇంట్రడక్షన్ సీన్స్ ఎలా ఉంటాయన్నది కూడా జక్కన్న హింట్ ఇచ్చేసారు. సరిగ్గా `ఆర్. ఆర్.ఆర్` ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ఇలా టాప్ సీక్రెట్ ని లీక్ చేసారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో క్లారిటీగా చెప్పలేం కాబట్టి అలాంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం సుకుమార్ `పుష్ప `పార్ట్-2` షూటింగ్ లో ఉన్నారు.
రెండవ భాగాన్ని మార్చిలో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాతే చరణ్ ప్రాజెక్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చరణ్ ఎంట్రీతో విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గినట్లేనా? అంటే.. అవుననే గుసగుస వినిపిస్తోంది. విజయ్ దేరకొండ హీరోగా సుకుమార్ ఓ చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్నేహితుడు కేదార్ నిర్మాతగా పరిచయం అవ్వాలనుకున్నారు. ప్రాజెక్ట్ అంతా ఒకే అయిపోయింది. అధికారిక ప్రకటన ఇప్పటివరకూ లేదు గానీ తాజా సన్నివేశాన్ని బట్టి ప్రాజెక్ట్ ఉందా లేదా.. ఆలస్యమవుతుందా? అన్న కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ తర్వాత చరణ్- సుకుమార్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మిడ్ లోనో.. చివర్లోనో ప్రారంభం కాదు. 2023 లోనే సెట్స్ కెళ్లే ఛాన్సుంటుందని అంటున్నారు. వచ్చే ఏడాది చరణ్.. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్.. శంకర్ సినిమాని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో సుకుమార్ స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దే అవకాశం ఉంది. అలాగే `పుష్ప` కోసం చాలా కాలంగా శ్రమిస్తున్నారు కాబట్టి విశ్రాంతి కి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.