తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది దర్శకులు ఉన్నా.. కొందరు మాత్రం భిన్నం. వీరంతా తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన వారు. ఆ కోవలోకే వస్తారు క్రిష్ జాగర్లమూడి. ఎంతటి టిపికల్ సబ్జెక్టుఅయినా సరే.. తనదైనశైలిలో రూపొందించటం.. దానికి తన మార్కును అద్దే విషయంలో ఏ మాత్రం ఫెయిల్ కారు. ఈ కారణంతోనే.. హీరో ఎవరన్నది కాకుండా.. క్రిష్ సినిమా అన్నంతనే ఆయనకంటూ కొంత ఫ్యాన్ క్లబ్ తప్పనిసరిగా చూసే వారంటారు. క్రిష్ మూవీ అంటేచాలు.. తప్పనిసరిగా చిక్కని కథతో పాటు.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎఫెక్టివ్ గా చెప్పే గుణంలో ఆయనకు ఎక్కువ.
అంతేకాదు.. తెర మీద పాత్రలు మాత్రమే తప్పించి.. నటులు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవటంలోనూ క్రిష్ ముందుంటారు. ఆయన దర్శకత్వం వహించిన కొండపాలం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక.. ఈ సినిమా మీద ఆసక్తి మరింత ఎక్కువైంది. పాటలు అంతలా ఆదరణకు నోచుకోకున్నా.. కాస్తంత భిన్నమైన కథనంతో.. సీమ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈ మూవీ మీద అంచనాలు ఉన్నాయని చెప్పాలి.
తాను తీసే సినిమాకు సంబంధించిన ప్రతిది డిటైలింగ్ గా చూసే క్రిష్.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ విషయంలో పొరపాటు చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ సినిమాలో హీరో.. హీరోయిన్ ది గొర్రెలు కాచుకునే నేపథ్యం. అలాంటివేళ.. గ్లామర్ భామ అయిన రకుల్ ను గొర్రెల కాపరుల అమ్మాయిగా ఒదిగిపోయేలా ఆమెను తయారు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె చేతికిఉండే రెండు ఉంగరాలు మాత్రం.. టీజర్ లోనే రెండు మూడు సార్లు కనిపిస్తాయి. గొర్రెలు కాచే వారి చేతికి బంగారు వస్తువులు దాదాపుగా ఉండవు. అందునా..గొర్రెల మేత కోసం కొండలు.. కోనలు తిరుగుతూ ఉండే వారి చేతివేళ్లకు రెండు ఉంగరాలు ఉంటాయా?
రకుల్ కు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అయిన ఈ రెండు ఉంగరాల్ని.. ఈ సినిమా వరకు.. అది కూడా వేళ్లు కచ్ఛితంగా ఎలివేట్ అయ్యే సీన్లలో తీయించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఎంత మంచి వంటకమైనా.. పంటి కింద ఇసుక తగిలినట్లు ఉంటే.. తింటూ ఎంజాయ్ చేయలేం కదా? క్రిష్ లాంటి దర్శకుడు ఈ లాజిక్ మిస్ కావటం ఏమిటో?