జ‌క్క‌న్న ప్ర‌తిభ‌ని ప్ర‌భాస్ ముందే ప‌సిగ‌ట్టాడా?

Update: 2022-12-13 09:30 GMT
జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన విజువ‌ల్ ఎక్స్ట్రావ‌గాంజా 'RRR'. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన ఈ విజువ‌ల్ వండ‌ర్ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. మార్చిలో పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన విష‌యం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన త‌రువాత నుంచి ఈ మూవీపై హాలీవుడ్ ప్ర‌ముఖులు, టెక్నిషియ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అంతే కాకుండా ఈ మూవీ ఆస్కార్ అకాడ‌మీ దృష్టికి వెళ్లేలా నెట్టింట జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప్ర‌చారానికి తోడు 'RRR' జక్క‌న్న ఊహించిన‌ట్టే వ‌రుస‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల్ని ద‌క్కించుకుంటూ ఆస్కార్ బ‌రికి స‌ర్వ‌స‌న్నద్దం అవుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇటీవ‌ల ఈ మూవీకి ప్ర‌తిష్టాత్మ‌క న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ అవార్డ్ లు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఉత్త‌మ ద‌ర్శ‌కుడుగా రాజ‌మౌళి, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా కీర‌వాణి అవార్డుల‌ని సొంతం చేసుకోవ‌డంతో దేశ వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా ప్ర‌తిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ -2023కి నామినేట్ కావ‌డంతో చిత్ర బృందంపై అభినంద‌న‌ల వ‌ర్షం కురుస్తోంది. ప‌లువురు స్టార్ లు రాజ‌మౌళి, కీర‌వాణిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీకి ప్ర‌తిష్టాత్మ‌క న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ అవార్డ్ లు ద‌క్క‌డంతో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. వీరిపై సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌త్యేక పోస్ట్ ని షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం.

'ది గ్రేటెస్ట్‌ రాజ‌మౌళిగారు ప్ర‌తిష్టాత్మ‌క న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ అవార్డ్ ని ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సొంతం చేసుకుంటూ ప్ర‌పంచాన్ని జ‌యించ‌బోతున్నారు. ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కులుగా లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి గారు న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ స‌ర్కిల్ అవార్డ్ ని అందుకుంటున్నందుకు శుభాభినంద‌న‌లు' అంటూ ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా రాజ‌మౌళి, కీర‌వాణిల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించి వారిపై త‌న‌కున్న అభిమానాన్ని, ప్రేమ‌ని చాటుకోవ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అయితే ప్ర‌భాస్ పోస్ట్ కు రాజ‌మౌళి ఇచ్చిన రిప్లై కూడా ఇప్ప‌డు వైర‌ల్ అవుతోంది. 'థ్యాక్యూ డార్లింగ్‌.. నేను అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపుని సాధిస్తాన‌ని నేను న‌మ్మ‌ని స‌మ‌యంలో నువ్వు న‌న్న బ‌లంగా న‌మ్మావు' అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ తో వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి బాండింగ్ వుందో మ‌రో సారి స్ప‌ష్టం కావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ నెట్టింట ఈ పోస్ట్ ల‌ని వైర‌ల్ చేస్తూ షేర్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News