RRR ఫ్యాన్స్ ఆ డైరెక్ట‌ర్ ని బెదిరించారా?

Update: 2022-12-26 14:28 GMT
ఇండియా నుంచి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ నామినేట్ అయిన గుజ‌రాతీ మూవీ `ఛెల్లో షో`. పాన్ న‌ళిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ మూవీలో భ‌విన్ రాబారి, భ‌వేష్ శ్రీ‌మాలి, రిచా మీనా, డిపెన్ వావ‌ల్, ప‌రేష్ మెహ‌తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పాన్ న‌ళిన్, సిద్ధార్ధ్ రాయ్ క‌పూర్ తో పాటు మ‌రో ఇద్ద‌రు ఈ మూవీని నిర్మించారు. అనూహ్యంగా వార్త‌ల‌లో నిలిచిన ఈ మూవీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.  

ఈ ఏడాది అక్టోబ‌ర్ 14న విడుద‌లైన ఈ మూవీ గ‌త ఏడాది జూన్ 10న 20వ ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివెల్ లో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. స్పెయిన్ లో జ‌రిగిన వ‌ల్లాడోలిడ్ చిత్రోత్స‌వంలో గోల్డెన్ స్పైక్ పుర‌స్కారంతో పాటు ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల్ని గెలుచుకుంది. గుజ‌రాత్ లోని ఓ మారుమూల గ్రామంలో జ‌రిగే క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. అనూహ్యంగా ఈ మూవీ 95వ అడాడ‌మీ అవార్డుల‌కు ఇండియా త‌రుపున నామినేట్ కావ‌డం ప‌లువుర‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ఈ మూవీని `ది లాస్ట్ షో` పేరుతో ఇంగ్లీష్ లోనూ విడుద‌ల చేశారు. అయితే ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ అయిన త‌రువాత తాను బెదిరింపుల‌కు గుర‌య్యాన‌ని, కొంత మంది నెటిజ‌న్ లు త‌న‌ని టార్గెట్ చేస్తూ ఆస్కార్ బ‌రి నుంచి త‌న సినిమాని త‌ప్పించాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌న బెదిరించార‌ని ద‌ర్శ‌కుడు పాన్ న‌ళిన్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఆస్కార్ బ‌రి నుంచి త‌న సినిమాని త‌ప్పించాల‌ని, లేకుంటే ప‌రిణామాలు తీవ్రంగా వుంటాయ‌ని కొంత మంది ద‌ర్శ‌కుడు పాన్ న‌ళిన్ ని, అత‌ని టీమ్ ని బెదిరించార‌ట‌.

ఓ జాతీయ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన ద‌ర్శ‌కుడు పాన్ న‌ళిన్ తాజా వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే సినిమాని చూసిన ఆడియ‌న్స్‌, క్రిటిక్స్ త‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం మొద‌లు పెట్టార‌ని, ఆ త‌రువాత త‌న‌పై ట్రోలింగ్ ఆగిపోయింద‌న్నాడు.

ఆస్కార్ బ‌రిలో తెలుగు సినిమా `RRR`కు రీసెంట్ గా చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే. `నాటు నాటు` సాంగ్ కార‌ణంగా `RRR` ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌డం తెలిసిందే. ఈ సినిమా కార‌ణంగానే ప‌లువురు నెటిజ‌న్ లు `ఛెల్లో షో` మూవీ టీమ్ పై నెటిజ‌న్ లు ట్రోల్ చేయ‌డం.. నామినేష‌న్స్ నుంచి త‌ప్పుకోమ‌ని బెదిరింపుల‌కు దిగిన‌ట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News