'స‌లార్‌'లో బిగ్ స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేశారా?

Update: 2022-06-16 07:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ నుంచి దాదాపు మూడేళ్ల త‌రువాత వ‌చ్చిన మూవీ 'రాధేశ్యామ్‌'. ఈ మూవీపై ప్ర‌భాస్ ఫ్యాన్స్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. క‌రోనా కార‌ణంగా విరామం ఏర్ప‌డ‌టంతో ప్ర‌భాస్ నుంచి సినిమా రావ‌డానికి మూడేళ్లు ప‌ట్టింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధిస్తుంద‌ని, గ‌త రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌ని అభిమానులు చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. ఆ ఆశ‌ల్ని 'రాధేశ్యామ్‌' నెర‌వేర్చ‌లేక‌పోయింది. భారీ ఫ్లాప్ గా నిలిచి నిరాశ‌కు గురిచేసింది.

దీంతో ఇప్ప‌డు ఫ్యాన్స్ దృష్ణ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న మైథ‌లాజిక‌ల్ మూవీ'ఆది పురుష్' తో పాటు 'కేజీఎఫ్' సీరిస్ చిత్రాల‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న 'స‌లార్‌' మూవీపై వుంది. ఒక‌టి మైథ‌లాజిక‌ల్ మూవీ.. మ‌రొక‌టి హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా. ఇందులో ఫ్యాన్స్ మాత్రం 'స‌లార్' పైనే ప్ర‌త్యేక దృష్టిని పెట్టారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న 'ఆది పురుష్‌' షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా ఐదు భాష‌ల్లో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేశారు. అయినా స‌రే ఫ్యాన్స్ మాత్రం ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ ల కాంబినేష‌న్ లో రూపొందుతున్న 'స‌లార్‌' కే తొలి ప్రాధాన్య‌త‌నిస్తుండ‌టం విశేషం. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ఓ వార్త తాజాగా ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  

'స‌లార్‌' మూవీలో ప్ర‌భాస్ ర‌గ్గ్‌డ్ లుక్ లో మ్యాచో మ్యాన్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ తో పాటు ప్ర‌భాస్ లుక్ ని కూడా మేక‌ర్స్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్ర‌క‌టించి షాకిచ్చారు. అయితే ఈ మూవీలో ప్ర‌భాస్ ర‌ఫ్ లుక్ తో పాటు స్లిప్ అండ్ హ్యాండ్స‌మ్ లుక్ లోనూ క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ప్ర‌భాస్ ముంబై బాంద్రాలో 'ఆది పురుష్' డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ లో క‌ల‌సి ఆయ‌న ఇంటి ఆవ‌ర‌ణ లో క‌నిపించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

దీంతో స‌డ‌న్ గా స్లిమ్ లుక్ లోకి మారిపోయిన ప్ర‌భాస్ ని చూసి 'స‌లార్‌'లో రెండ‌వ లుక్ కోస‌మే త‌ను ఇలా స్లిమ్ గా మారాడ‌ని, డ్యుయ‌ల్ లుక్ లో ప్ర‌భాస్ ఈ మూవీలో క‌నిపించ‌బోతున్నార‌ని నెట్టింట ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫొటోలు, వీడియోల్లో గ‌తంతో పోలిస్తే బాగా బ‌రువు త‌గ్గిన ప్ర‌భాస్ స‌రికొత్త మేకోవ‌ర్ లో క‌నిపిస్తున్న తీరు ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేస్తోంది.

ఈ లుక్ లో 'స‌లార్'లో క‌నిపించి ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోసం స‌ర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? అని కూడా చాలా మంది డౌట్ రైజ్ చేస్తున్నారు. 'స‌లార్‌'లో ప్ర‌భాస్ కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుండగా విల‌న్ గా జ‌గప‌తిబాబు క‌నిపించ‌బోతున్నారు. కీల‌క పాత్ర‌లో  మ‌ల‌యాళ హీరో పృథ్విరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నారు.
Tags:    

Similar News