'డాకు మహారాజ్‌' ట్రైలర్‌ రిలీజ్‌ టైం లాక్‌

అక్కడ ట్రైలర్‌ను విడుదల చేసి, ఇండియాలోనూ అదే సమయంలో ఆన్‌ లైన్ ద్వారా విడుదల చేయబోతున్నారు.

Update: 2025-01-04 10:26 GMT

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డాకు మహారాజ్‌ సినిమా ట్రైలర్‌ను జనవరి 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం డల్లాస్‌ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మేకర్స్ ప్లాన్‌ చేశారు. ఇప్పటికే మేకర్స్ అంతా అక్కడ ల్యాండ్‌ అయ్యారు. మరి కాసేపట్లోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అక్కడ ప్రారంభం కాబోతుంది. అక్కడ ట్రైలర్‌ను విడుదల చేసి, ఇండియాలోనూ అదే సమయంలో ఆన్‌ లైన్ ద్వారా విడుదల చేయబోతున్నారు.


అమెరికా కాలమానం ప్రకారం డిసెంబర్‌ 4వ తారీకు రాత్రి 9 గంటల సమయంలో ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేస్తారు. ఆ సమయంలో ఇండియాలో జనవరి 5వ తారీకు ఉదయం 8 గంటలు అవుతుంది. అందుకే అదే సమయంలో డాకు మహారాజ్‌ సినిమా ట్రైలర్‌ను జనవరి 5 ఉదయం 8 గంటల 39 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. అమెరికాలో విడుదల అయిన కొద్ది సమయం తర్వాత ఇండియాలో డాకు మహారాజ్ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని గురించి చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా టైమ్‌, డేట్‌ ఇచ్చి పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందిన డాకు మహారాజ్ సినిమాతో బాబీ భారీ విజయాన్ని నందమూరి ఫ్యాన్స్‌కి ఇవ్వబోతున్నాడు. వాల్తేరు వీరయ్య వంటి భారీ విజయాన్ని మెగా ఫ్యాన్స్‌కి అందించిన దర్శకుడు బాబీ కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్‌కి డాకు మహారాజ్ సినిమాతో అదే స్థాయి విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో బాబీ సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. కనుక డాకు మహారాజ్ సినిమా ఫలితం విషయంలో ఆందోళన అస్సలు లేదు అంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. వసూళ్ల గురించి మా లెక్క అంతా అంటూ ఫ్యాన్స్‌ ధీమాతో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించగా ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటించింది. శ్రద్ద శ్రీనాథ్ సినిమాలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. బాబీ డియోల్‌ ఈ సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్‌లోనూ ఈ సినిమా గురించి అంచనాలు పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాబీ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో పోటీ తీవ్రంగా ఉన్నా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను డాకు మహారాజ్ సినిమా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News