జాతీయ అవార్డుతో ఈ ఏడాదంతా రాజుగారికి లాభాలే

Update: 2021-03-23 06:30 GMT
టాలీవుడ్‌ స్టార్ నిర్మాత దిల్‌ రాజు మరో జాతీయ అవార్డును దక్కించుకున్నారు. శతమానం భవతి సినిమా తో ఉత్తమ ప్రేక్షకాధరణ సినిమాగా జాతీయ అవార్డును దక్కించుకున్న దిల్‌ రాజు నిన్న ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల్లో మహర్షి సినిమాకు గాను మరోసారి ఉత్తమ సినిమా అవార్డును దక్కించుకున్నాడు. దిల్‌ రాజు ఈ జాతీయ అవార్డుతో ఈ ఏడాది అంతా కూడా లాభాలు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 9వ తారీకున విడుదల కాబోతున్న వకీల్‌ సాబ్‌ మొదలుకుని రామ్‌ చరణ్‌ శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా వరకు అన్ని కూడా జాతీయ అవార్డు వల్ల మంచి హైప్ ను కలిగి ఉండే అవకాశం ఉందంటున్నారు.

వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకుంది. ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో జాతీయ అవార్డు గ్రహీత దిల్ రాజు నిర్మించిన వకీల్‌ సాబ్‌ అంటూ పబ్లిసిటీ చేసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రచారం రావడంతో పాటు సినిమాకు మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు హిందీలో ప్రస్తుతం 'జెర్సీ' ని రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. జెర్సీకి జాతీయ అవార్డు వచ్చిన కారణంగా రీమేక్ పై హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కనుక బిజినెస్ కనీసం 50 శాతం అయినా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జెర్సీని హిందీలో అల్లు అరవింద్‌ తో కలిసి దిల్‌ రాజు రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇలా జాతీయ అవార్డుల వల్ల దిల్ రాజుకు ఈ ఏడాదికి భారీగా లాభాలు దక్కడం ఖాయం అనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News