సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా విడుదలకు సరిగ్గా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. బాగా ఆలస్యంగా అయినా తెలుగు వెర్షన్ కోసం మొత్తానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది చేసి నిన్న రజనితో పాటు టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగానే చేసారు. అందులో భాగంగా రజనితో పాటు దర్శకుడు రంజిత్ పా నిర్మాత ధనుష్ అందరు సినిమా గురించి హీరో గురించి ఆకాశానికెత్తారు. అది ఏ సినిమాకైనా సహజంగా జరిగేదే. కానీ అతిధుల్లో ఒకడిగా వచ్చిన దర్శకుడు మారుతీ మాత్రం ఓపెన్ గా మాట్లాడి స్వీట్ షాక్ ఇచ్చాడు. తెలుగులో సాధారణంగా ఎవరైనా దర్శకుడి సినిమా ప్లాప్ అయితే తర్వాత అతని ఫోన్ కాల్స్ హీరోలు లిఫ్ట్ చేయరని అలాంటిది కబాలి ఆడకపోయినా రజని పిలిచి మరీ కాలా అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు కూడా మారుతికి మద్దతుగానే తన స్పీచ్ కొనసాగించడం విశేషం. నిజానికి ఇద్దరి ఉద్దేశం రజని గొప్పదనం చెప్పడమే.
కానీ ఏ దర్శకుడికైనా తన గత సినిమా ప్లాప్ అని కొత్త సినిమా వేడుకలో చెప్పడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే. నిజానికి కాలా బిజినెస్ మీద కబాలీ ప్రభావం ఉంది. అది నేరుగా బయటపెట్టుకోకుండా మేనేజ్ చేస్తున్నారు. అలాంటిది మారుతీ నేరుగా కబాలి ఆడలేదని స్టేజి పైనే చెప్పడంతో రంజిత్ పా కాస్త ఇబ్బందిగా కదిలాడు. మారుతీ చెప్పినా చెప్పకపోయినా అది నిజం కాబట్టి ఒప్పుకోక తప్పదు. ఇక్కడిదాకా ఎందుకు తమిళనాడులో ఫాన్స్ కూడా అనుమాన పడుతోంది ఈ విషయంలోనే. రేపు విడుదలై హిట్ అయితే కబాలిని ఈజీగా మర్చిపోతారు. అదేమంత పెద్ద విషయం కాదు. అందుకే కాలాను రంజిత్ పా ఎలా డీల్ చేసుంటాడు అనే ఆసక్తి సర్వత్రా ఉంది. విడుదలకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. కర్ణాటకలో బ్యాన్ చేసినప్పటికీ చివరి ఆశగా కోర్ట్ లో పిటీషన్ వేసాడు నిర్మాత ధనుష్. తీర్పు అనుకూలంగా వస్తే అక్కడ కూడా రూట్ క్లియర్ అయినట్టే.