ఏదైనా సినిమా వాయిదా పడిందంటే క్రేజ్ తగ్గుతుంది. సినిమాలో తప్పులు దొర్లుంటాయనో - మరొకటనో... ఇలా ఏదో రకంగా నెగిటివ్ ప్రచారం బయటికొచ్చేస్తుంటుంది. అయితే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. జనతా గ్యారేజ్ విడుదల తేదీ ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 2కి వెళ్లినా సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికీ ఇలాగే జరిగిందనీ - అవన్నీ హిట్టే కాబట్టి సెంటిమెంట్ పరంగా కూడా కలిసొస్తుందని మాట్లాడుకొంటున్నారు జనాలు. బిజినెస్ కూడా అలాగే పాజిటివ్ గా జరుగుతోంది.
తాజాగా నైజాం రైట్స్ ని దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేశాడని తెలిసింది. ఏకంగా రూ.17 కోట్లు వెచ్చించి సినిమా రైట్స్ ని కొన్నారట.ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ స్టామినాపైనా - కొరటాల శివ దర్శకత్వంపైనా దిల్ రాజుకి ఉన్న కాన్ఫిడెన్సు అదనీ, అందుకే ప్రతి విషయంలోనూ స్టాటిస్టికల్ గా ఉండే దిల్ రాజు వెనకా ముందు చూడకుండా భారీ ధరకు జనతా గ్యారేజ్ రైట్స్ కొనుగోలు చేశాడని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. నైజామ్ లో 17 కోట్లకి రైట్స్ అమ్ముడుపోవడం ఎన్టీఆర్ కెరీర్ లో ఇదే మొదటిసారి. బిజినెస్ పరంగానే రికార్డు కొట్టిన జనతా గ్యారేజ్ విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.