ఎఫ్2 పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో దిల్ రాజు ఆనందం మాములుగా లేదు. నిన్న సాయంత్రమే బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి వెంకీ వరుణ్ లను తీసుకొచ్చి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ రూపంలో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఇది ఎప్పుడూ చేసేదే అయినా దిల్ రాజుకు ఈ సంక్రాంతి మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి, గత ఏడాది తీసిన మూడు సినిమాలు నిర్మాతగా తన బ్యానర్ రేంజ్ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. లవర్-శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్లు కాగా హలో గురు ప్రేమ కోసమే అతి కష్టం మీద యావరేజ్ అనిపించుకుంది.
సో చాలా బ్యాడ్ ఇయర్ గా దిల్ రాజు 2018ని తీసుకున్నారు. ఆ సమయంలో తన సినిమాల మీద వచ్చిన క్రిటిక్స్ రివ్యూస్ ని దిల్ రాజు అంగీకరించలేకపోయారు.పైపెచ్చు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని మీరే సరిగా విశ్లేషించలేదని ఏదేదో అనేసారు. అయినా సరే ఫలితాలేమి తారుమారు కాలేదు. ఇప్పుడు ఎఫ్2 వంతు వచ్చింది. ఇందులో వినోదం గురించి వెంకటేష్ పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ గురించి క్రిటిక్స్ అందరూ ఒకేమాటగా ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చేసారు. సెకండ్ హాఫ్ మీద కామెంట్స్ ఉన్నప్పటికీ అవన్నీ వెంకీ పుణ్యమా అని కవర్ అయిపోతున్నాయి.
అందుకే దిల్ రాజు ఈసారి క్రిటిక్స్ ని టార్గెట్ చేయలేదు. సరికదా మీడియా సపోర్ట్ చాలా బాగుందని అందరు మంచి రివ్యూ ఇచ్చారనే విధంగా స్పందించడం విశేషం. ఏదైతేనేం దిల్ రాజు కోరుకున్న ఫలితం దక్కింది. రజనీకాంత్-రామ్ బాలకృష్ణ-రామ్ చరణ్ లాంటి మార్కెట్ మాన్స్ టర్లను ఎదురుకుని మరీ ఎఫ్2 గట్టిగా నిలవడం చిన్న విషయం కాదుగా. ఊహించినట్టే సంక్రాంతి పండక్కు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎఫ్2నే లాగేస్తోంది. అందుకే ఫలితంతో పాటు మాట కూడా మారిపోయింది మరి.
Full View