రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో... ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా కు సంబంధించిన కీలక ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
ఇక సినిమా చిత్రీకరణ జరుగుతున్న ప్రాంతానికి నిర్మాత దిల్ రాజు మరియు ఆయన భార్య తేజస్విని వెళ్లారు. ఆ సమయంలోనే స్థానికంగా ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని దిల్ రాజు దంపతులు దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు దంపతులకు ఇటీవలే బాబు జన్మించిన విషయం తెలిసిందే, ఆ సందర్భంగా దిల్ రాజు దంపతులు క్షీర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
పూజ అనంతరం వేద పండితులు దంపతులను ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదాలను అందించారు. అమ్మవారి చిత్రపటాన్ని కూడా దిల్ రాజు దంపతులకు వేద పండితులు అందించారు.
ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే తమిళంలో సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక సినిమా ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. ఒక వైపు వందల కోట్ల బడ్జెట్తో సినిమాలను నిర్మిస్తూ మరో వైపు రెండు మూడు కోట్ల రూపాయల బడ్జెట్తో కూడా సినిమాలు నిర్మిస్తున్న ఘనత కేవలం దిల్ రాజ్ కి మాత్రమే చెందింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.