బెంగళూరు డేస్.. మలయాళంలో ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం బోలెడంత పోటీ పడి మరీ తెలుగు హక్కులు దక్కించుకున్నాడు దిల్ రాజు. కానీ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. హీరోల కాంబినేషన్స్ చాలానే అనుకున్నారు కానీ.. చివరకు పక్కన పెట్టేయాల్సి వచ్చింది. చివరకు తమిళ్ లో పీవీపీ స్టార్ట్ చేసినపుడు.. బైలింగ్యువల్ తీద్దామని అనుకుని కూడా.. చివరకు డ్రాప్ అయ్యారు.
రాణా - ఆర్య - సమంత - శ్రీదివ్యలు నటించిన బెంగళూరు నాట్కాల్.. అనే పేరుతో రిలీజ్ అయింది. సినిమాకి మంచి పేరే వస్తోంది కానీ.. మలయాళంలో మాదిరిగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం లేదు. కనీసం పెట్టుబడి వరకూ వచ్చేసినా పీవీపీ బయటపడ్డట్టే అంటున్నారు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ మలయాళంలో క్లిక్ అయినంతగా.. ఇతర భాషల్లో సెట్ కావడం కష్టం అనే అంచనాలున్నాయి.
అందుకే బెంగళూరు రైట్స్ తన దగ్గర ఉన్నా.. దిల్ రాజు రీమేక్ విషయంలో వెనకంజ వేశాడు. తెలుగులో వర్కవుట్ కాదనే విషయం ముందుగానే రాజు అంచనా వేశాడంటున్నారు. శర్వానంద్ - వరుణ్ తేజ్.. ఇలా చాలా కాంబినేషన్స్ అనుకుని, చివరకు దిల్ రాజు పూర్తిగా డ్రాప్ అయిపోయాడు. ఎమోషన్స్ - ఫీల్ బేస్డ్ గా ఉండే ఈ మూవీ కోలీవుడ్ రిజల్ట్ తర్వాత.. దిల్ రాజు డిసిషన్ కరెక్టే అనిపిస్తోంది. ఇక ఈ బెంగళూరు నాట్కాల్ ని డబ్బింగ్ చేసేందుకు పీవీపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.